బుధవారం, అక్టోబర్ 02, 2019

శ్రీ వెంకటేశునికి...

అమ్మోరు తల్లి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అమ్మోరు తల్లి (2006)
సంగీతం : దేవా
సాహిత్యం : వెలిదండ్ల
గానం : చిత్ర

శ్రీ వెంకటేశునికి చెల్లెలివమ్మా
చిట్టి చెల్లెలివమ్మా
ఇంద్రకీలాద్రిలో వెలసిన దుర్గవు నీవమ్మ
కంచి కామాక్షివమ్మా

నీ నవ్వులో.. నీ నవ్వులో
పున్నమి వెన్నెలే విరబూయునమ్మా
తల్లి అన్నపూర్ణకు నేను అన్నంపెట్టనా
నేను కన్నతల్లిలా నీకు జోలపాడనా

శ్రీ వెంకటేశునికి చెల్లెలివమ్మా
చిట్టి చెల్లెలివమ్మా
ఇంద్రకీలాద్రిలో వెలసిన దుర్గవు నీవమ్మ
కంచి కామాక్షివమ్మా

ఒడిలోన లాలించి ఓదార్చి పాలిచ్చి
నను నీవు పెంచావమ్మా
అమ్మవలె మురిపించి
ఆటలనే ఆడించి లాలినే పోశావమ్మా

తల్లీ అభిరామి బొట్టును నాకు దిద్దావే
శ్రీశైలం భ్రమరాంబ పూల జడనే వేశావే
తారలనే దూసుకు తెచ్చి కమ్మలుగా ఇచ్చావే
కాంచిపురంలో నాకు చీర కొంటివే
నా ఆటపాటలో నువ్వు బొమ్మవైతివే

కాశీవిశాలాక్షి హారాలే కొని తెచ్చి
నాకోర్కె తీర్చావమ్మా
కాళహస్తి జ్ఞానాంబ బంగారు గాజులను
చేతులకే వేశావమ్మా

చీకటిని కాటుకగా నీవు నాకు దిద్దావే
అందంగా ముక్కెరగా జాబిలి ముక్కని పెట్టావే
ఆ ఇంధ్రధనువును తెచ్చి వడ్డాణంగా ఉంచావే
బాల సుందరీ నీవు శక్తి రూపిణీ
నేను పాట పాడగా నీవు ఆట ఆడవా

శ్రీ వెంకటేశునికి చెల్లెలివమ్మా
చిట్టి చెల్లెలివమ్మా
ఇంద్రకీలాద్రిలో వెలసిన దుర్గవు నీవమ్మ
కంచి కామాక్షివమ్మా

నీ నవ్వులో.. నీ నవ్వులో
పున్నమి వెన్నెలే విరబూయునమ్మా
తల్లి అన్నపూర్ణకు నేను అన్నంపెట్టనా
నేను కన్నతల్లిలా నీకు జోలపాడనా
తల్లి అన్నపూర్ణకు నేను అన్నంపెట్టనా
నేను కన్నతల్లిలా నీకు జోలపాడనా 


2 comments:

శ్రీ అన్నపూర్ణ..దేవీ నమోస్తుతే

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.