రెండునెలలగా భక్తి గీతాలు విషాద గీతాలతో హోరెత్తించేశాం కదా అందుకే ఈ నెలలో మిగిలిన రోజులు సరదాగా సినిమాలో వచ్చిన పారడీ పాటలను గుర్తు చేస్కుని నవ్వుకుందాం. ముందుగా శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలోని పాట సన్నివేశం హాస్యభరితమైనా పాట మాత్రం చాలా సీరియస్ సబ్జెక్ట్ పై రాశారు వేటూరి వారు. ఈ పాట ఒరిజినల్ కీర్తన ఎమ్మెస్ గారి గళంలో ఇక్కడ వినవచ్చు. సినిమాలోని పేరడీని ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : శ్రీవారికి ప్రేమలేఖలు (1984)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, శైలజ
రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ
రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ
రామ రాజ రాజేశ్వరా...
రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ
అఘమేఘమా రుత శ్రీకర
అఘమేఘమా రుత శ్రీకర
అసురేంద్ర మృగేంద్ర వర జనకా
పరహింస పారాయణ చంద్రశ్రీ
పరహింస పారాయణ చంద్రశ్రీ
పరంధామ మాతృ ప్రాణేశ్వరా
పరహింస పారాయణ చంద్రశ్రీ
ఆచారమా సంప్రదాయమా
ఆచారమా సంప్రదాయమా
ఆడపిల్లలకే అపచారమా
పరహింస పారాయణ చంద్రశ్రీ
కట్నమన్నదే కంఠపాశమై
కలకంఠి కంట నీరొలకగా
కట్నమన్నదే కంఠపాశమై
కలకంఠి కంట నీరొలుకగా
సంసారమంటే సంత బేరమా
సంసారమంటే సంత బేరమా
తగునా జనకా సమ్మతమా
ఇది నీ మతమా
పరహింస పారాయణ చంద్రశ్రీ
పరంధామ మాతృ ప్రాణేశ్వరా
పరహింస పారాయణ చంద్రశ్రీ
మనసులేని ఈ మనువులెందుకు
మమతలేని మాంగళ్యమెందుకు
మనసులేని ఈ మనువులెందుకు
మమతలేని మాంగళ్యమెందుకు
మెడలు వంచి చేసే మేళాల పెళ్ళి
మెడలు వంచి చేసే మేళాల పెళ్ళి
ఇహమా పరమా అది నీ తరమా
ఇహమా పరమా అది నీ తరమా
పరహింస పారాయణ చంద్రశ్రీ
పరంధామ మాతృ ప్రాణేశ్వరా
పరహింస పారాయణ చంద్రశ్రీ
4 comments:
thank you
థాంక్స్ ఫర్ ద ఎంకరేజ్మెంట్ సర్..
యెవ్వర్ గ్రీన్ మూవీ..
అవునండీ.. ఇప్పటికీ స్ట్రెస్ బస్టర్ గా అప్పుడపుడు చూస్తుంటాను.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.