బొంబాయి సినిమాలోని ’అది అరబిక్ కడలందం’ పాటకు పేరడీగా వచ్చిన ఈ పాట నవ్వించినంతగా అప్పట్లో మరే పాట నవ్వించుండక పోవచ్చు. ఒరిజినల్ వర్షన్ ఇక్కడ చూడవచ్చు. పిట్టలదొర చిత్రంలోని ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : పిట్టలదొర (1996)
సంగీతం : రమణి భరద్వాజ్
సాహిత్యం : పోలిశెట్టి లింగయ్య ?
గానం : ??
ఇంత కూరుంటెయ్యమ్మో
ఇంత బువ్వుంటెయ్యమ్మో
ఇంత కూరుంటెయ్యమ్మో
ఇంత బువ్వుంటెయ్యమ్మో
నీ కొడుకులు బిడ్డలు సల్లంగుండా
తల్లో దండం బెడుతా
అమ్మా.. అమ్మా.. అమ్మా..
అమ్మ అమ్మ అమ్మా
అమ్మా.. అమ్మా.. అమ్మా..
అమ్మ అమ్మ అమ్మా.. తల్లో
వంకాయ కూరా ఔకారమొస్తది
ఒద్దు నా తల్లో
వంకాయ కూరా ఔకారమొస్తది
ఒద్దు నా తల్లో
బీరకాయ కూరా బోరే గొట్టుతది
ముద్దే బోదు తల్లో
అరె మటన్ పులుసులో
సింగిల్ పీసేన మరీ బ్యాడ్ తల్లో
మటన్ పులుసులో
సింగిల్ పీసేన మరీ బ్యాడ్ తల్లో
వట్టి చేపలైనా చికెన్ పీసులైన
ఉంటే వెయ్యమ్మో
అమ్మా.. అమ్మా.. అమ్మా..
అమ్మ అమ్మ అమ్మా
అమ్మా.. అమ్మా.. అమ్మా..
అమ్మ అమ్మ అమ్మా.. తల్లో
వెజిటేరియన్ ఫుడ్డంటేనే
అసలే పడదమ్మో
వెజిటేరియన్ ఫుడ్డంటేనే
అసలే పడదమ్మో
వీక్ లో త్రైసైనా చికెన్ కర్రేయమ్మో
బీపీ ఉన్నది ఉప్పు కారం
కూరల్లో తగ్గించు మాతల్లో
బీపీ ఉన్నది ఉప్పు కారం
కూరల్లో తగ్గించు మాతల్లో
స్పెషల్ కుక్కును నాకై పెట్టిన
నీ బాధే తప్పేనమ్మో
అమ్మా.. అమ్మా.. అమ్మా..
అమ్మ అమ్మ అమ్మా
అమ్మా.. అమ్మా.. అమ్మా..
అమ్మ అమ్మ అమ్మా.. తల్లో
సంక్రాంతి పండక్కి సరికొత్త
వంటలు వండి పెట్టమ్మో
సంక్రాంతి పండక్కి సరికొత్త
వంటలు వండి పెట్టమ్మో
ఎగ్గు మసాలా కర్రంటే
నాకెంతిష్టమో తల్లో
అయ్యగారిదేదైన పాత
సూటుంటె పడేసి పో తల్లో
అయ్యగారిదేదైన పాత
సూటుంటె పడేసి పో తల్లో
ఎగస్ట్ర షూ జత ఏదైన ఉంటే
ఇటు ఇసిరేసి పో తల్లో
అమ్మా.. అమ్మా.. అమ్మా..
అమ్మ అమ్మ అమ్మా
అమ్మా.. అమ్మా.. అమ్మా..
అమ్మ అమ్మ అమ్మా.. తల్లో
ఇంత కూరుంటెయ్యమ్మో
ఇంత బువ్వుంటెయ్యమ్మో
ఇంత కూరుంటెయ్యమ్మో
ఇంత బువ్వుంటెయ్యమ్మో
నీ కొడుకులు బిడ్డలు సల్లంగుండా
తల్లో దండం బెడుతా
అమ్మా.. అమ్మా.. అమ్మా..
అమ్మ అమ్మ అమ్మా
అమ్మా.. అమ్మా.. అమ్మా..
అమ్మ అమ్మ అమ్మా.. తల్లో
4 comments:
హిట్ పారడీ సాంగ్..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
Original song is horrible. Parody lyrics are apt for such song
థాంక్స్ ఫర్ యువర్ కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.