వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన "శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్" సినిమాలోని ఈ పాట లిరిక్స్ పరమైన పేరడీ కాకపోయినా టేకింగ్ పరంగా మ్యూజిక్ పరంగా పేరడీగా తీస్కోవచ్చు. ఒరిజినల్ పాట ఇక్కడ చూడవచ్చు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : శ్రీకనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సినారె
గానం : బాలు, జానకి
నువ్వు నా ముందుంటే..
నిన్నలా చూస్తుంటే..
జివ్వుమంటుంది మనసు..
రివ్వుమంటుంది వయసు..
నువ్వు నా ముందుంటే..
నిన్నలా చూస్తుంటే..
జివ్వుమంటుంది మనసు..
రివ్వుమంటుంది వయసు..
నువ్వు నా ముందుంటే..
నిన్నలా చూస్తుంటే..
ముద్దబంతిలా ఉన్నావు..
ముద్దులొలికిపోతున్నావు..
ముద్దబంతిలా ఉన్నావు..
ముద్దులొలికిపోతున్నావు..
జింక పిల్లలా చెంగు చెంగుమని
చిలిపి సైగలే చేసేవు..
నువ్వు నా ముందుంటే..
నిన్నలా చూస్తుంటే..
జివ్వుమంటుంది మనసు..
రివ్వుమంటుంది వయసు..
నువ్వు నా ముందుంటే..
నిన్నలా చూస్తుంటే..
చల్లచల్లగ రగిలించేవు..
మెల్లమెల్లగ పెనవేసేవు..
చల్లచల్లగ రగిలించేవు..
మెల్లమెల్లగ పెనవేసేవు..
బుగ్గపైన కొనగోట మీటి
నా సిగ్గు దొంతరలు దోచేవు..
నువ్వు నా ముందుంటే..
నిన్నలా చూస్తుంటే..
జివ్వుమంటుంది మనసు..
రివ్వుమంటుంది వయసు..
నువ్వు నా ముందుంటే..
నిన్నలా చూస్తుంటే..
4 comments:
నాకు బాగా నచ్చిన సినీమా. బాగా నచ్చిన పాట. పాపం భరణి !. ఒకనాటి పల్లెటూరు లో గడిపిన (ఆనందించిన) సమయం గుర్తుకు వస్తుంది. పోస్ట్ లో వేసినందుకు థాంక్స్.
థాంక్స్ ఫర్ ద కామెంట్ రావు గారు :-)
సీత తో అదంత వీజీ కాదు..హిట్ డైలాగ్..బ్యూటిఫుల్ మూవీ..
అవునండీ.. నాకు చాలా నచ్చిన సినిమా.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.