శుక్రవారం, అక్టోబర్ 18, 2019

ఓ సీతా నీవంటి స్వీటు...

మాయాబజార్ లో రేలంగి గారి మీద చిత్రీకరించిన "సుందరి నీవంటి" పాటకు పేరడీగా సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలో వచ్చిన ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సీతారామయ్య గారి మనవరాలు (1991)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

ఓ సీతా హల్లో మై సీతా చెలి
ఓ సీతా నీవంటి స్వీటు స్వరూపము
వేర్వేరు సెర్చిన నోయే కదా.
ఓ సీతా నీవంటి స్వీటు స్వరూపము
వేర్వేరు సెర్చిన నోయే కదా.
ఊరంత సెర్చిన మాయే కదా
నన్నూరించి గిల్లేది నీవే కదా.
ఓ సీతా చెలి యు సీతా హల్లో మై సీతా
నీవంటి స్వీటు స్వరూపము
వేర్వేరు సెర్చిన నోయే కదా.
వేర్వేరు సెర్చిన నోయే కదా.

సీతా శారీ పేరట్టువో ఆంధ్రా ఫేమస్ పెసరట్టువో
ఐసు నేను కొట్టేవేళా క్రీమై పోయే నా ప్రేమే
ట్వింకిల్ ట్వింకిల్ స్టారువో చందా అంకుల్ లైటువో
సైటు నీకు కొట్టే వేళా నైటైపోయే డే టైమే
ఓ మిస్సా ఓ యస్సు అనరాదా
అదిచేదా ఓ కిస్సు కొడితే 
నే యుఎస్ లో పడతానే

ఓ సీతా నీవంటి స్వీటు స్వరూపము
వేర్వేరు సెర్చిన నోయే కదా.
వేర్వేరు సెర్చిన నోయే కదా.

ఐసా పైసా తేల్చుకో వీసా తెచ్చి ఇచ్చుకో
వాషింగ్టన్ను తాలూకాకే తాశీల్దారైపోతానే
వైటు హౌసు తోటలో నైటు క్వీను కోటలో
ఎంకి పాట బ్రేకే చేసి మంకీ డిస్కో ఆడేస్తా
ఉసిమీద ఉన్నానే శశిరేఖా అన్నానే
రేలంగి మోడల్లో రెచ్చి పోతున్నానే

ఓ సీతా హల్లో మై సీతా చెలి
ఓ సీతా నీవంటి స్వీటు స్వరూపము
వేర్వేరు సెర్చిన నోయే కదా.
ఓ సీతా నీవంటి స్వీటు స్వరూపము
వేర్వేరు సెర్చిన నోయే కదా.
ఊరంత సెర్చిన మాయే కదా
నన్నూరించి గిల్లేది నీవే కదా.
ఓ సీతా చెలి యు సీతా హల్లో మై సీతా
నీవంటి స్వీటు స్వరూపము
వేర్వేరు సెర్చిన నోయే కదా.
వేర్వేరు సెర్చిన నోయే కదా.

4 comments:

థాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ సర్..

మెలోడియస్ పేరడీ..

అవునండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.