శుక్రవారం, అక్టోబర్ 04, 2019

చల్లని మల్లెలతో...

ఈ రోజు మహాదేవి చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.



చిత్రం : మహాదేవి ( 2003)
సంగీతం : S.A. రాజ్ కుమార్
సాహిత్యం :
గానం :

చల్లని మల్లెలతో ఊయలకట్టా మాతా
చల్లగా శయనించు లాలి జో లాలి
వేపతో విసిరి నీకు పూజలు చేసే వేళ
తల్లిరో నిదురించు లాలీ జో లాలి

ఈ జగతినేలే తల్లికి కన్నబిడ్డ నేనేగా
కలలతేలి పోవమ్మా నన్నుగన్న తల్లి
చల్లని మల్లెలతో ఊయలకట్టా మాతా
చల్లగా శయనించు లాలీ జో లాలి

పామే తలదిండు ... వేపాకే పూలపక్క
తల్లి శయనిస్తే జోలాలి పాడె బిడ్డా
ఎన్నినాళ్ళ పుణ్యమో ఈ వరం దొరికేనే
ఆనందం పొంగెనమ్మ వెల్లువల్లే కన్నుల

దేవీ మహదేవీ ఏ సేవచేయగలనే
పాదం నీ పాదం సర్వదోషాలు తొలగించునే
 
చల్లని మల్లెలతో ఊయలకట్టా మాతా
చల్లగా శయనించు లాలీ జో లాలి


గోరుముద్దలందించి తినిపిస్తే వేడుకగా
భువనం పులకించి మరచునమ్మ ఆకలినీ
మదిలో వ్యధ నీకు విన్నవిస్తే చాలునుగా
వ్యధలే కనిపెట్టి మోక్షమిచ్చు మాతవుగా

దేవీ మహాదేవీ నీ దీవెన చాలునమ్మా
నీవే మా సర్వం అని నమ్మిన వారమమ్మా


చల్లని మల్లెలతో ఊయలకట్టా మాతా
చల్లగా శయనించు లాలీ జో లాలి
చల్లని మల్లెలతో ఊయలకట్టా మాతా
చల్లగా శయనించు లాలి జో లాలి

వేపతోవిసిరి నీకు పూజలు చేసే వేళ
తల్లిరో నిదురించు లాలీ జో లాలి
ఈ జగతినేలే తల్లికి కన్నబిడ్డ నేనేగా
కలలతేలి పోవమ్మా నన్నుగన్న తల్లి

చల్లని మల్లెలతో ఊయలకట్టా మాతా
చల్లగా శయనించు లాలి జో లాలి 


2 comments:


మహాలక్ష్మీ..దేవీ నమోస్తుతే.

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.