జగమే మాయ అన్న మాట వినగానే దేవదాసు సినిమాలో ఘంటసాల గారు పాడిన ఈ పాట గుర్తొస్తుంది. దీనికి పారడీగా సంసారం ఒక చదరంగం చిత్రంలో బాలు గారు పాడిన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : సంసారం ఒక చదరంగం (1987)
సంగీతం : కె. చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనమ్మా
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా
ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు
ఆశ అనే హరివిల్లు వర్ణాలమ్మా
పాశమనే ఎదముల్లూ యమబాధమ్మా
ఆశ పాశాలు మాసే వర్ణాలే
కలగంటే తప్పు నీదేనమ్మా ఈ బాదేనమ్మా
భార్యా పుత్రులనే వలలో పడకోయి
కాసులకే నీ సుతుడు అంకితమోయి
కాసులకే నీ సుతుడు అంకితమోయి
నాది నాది అనే బంధం వలదోయి
నీ గుటకే నిర్మాలానందమోయ్
నిముషమానంద మోయ్
నీతులు చెబుతుంటే కూతురు వినదోయి
తనపాటం గుణపాఠం కొడుకే కనడోయ్
తనపాటం గుణపాఠం కొడుకే కనడోయ్
కట్టే బట్టైన మాటే వినదోయి
కాబట్టే మందు కొట్టానోయి జో కొట్టానోయి
ఇల్లూ వాకిలీ పిల్లా మేకని
బ్రమపడకు బ్రతుకంత నాటకమోయి
శ్రమపడితే మిగిలేది బూటకమోయి
బాకీ బ్రతుకుల్లో బిడ్డలు వడ్డీలోయ్
కనుగొంటే సత్యమింతేనోయి ఈ సంతేనోయి
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా
జగమే మాయ బ్రతుకే మాయ
4 comments:
బ్యూటిఫుల్ మూవీ..
thank you
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
థాంక్స్ ఫర్ ద కామెంట్ వేటూరి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.