శనివారం, అక్టోబర్ 19, 2019

ఆడ్డవే మయూరే...

చెల్లెలి కాపురం చిత్రంలోని "చరణ కింకిణులు" పాటకు పేరడీగా ఇంకా చెప్పాలంటే సంగీతకారులమని చెప్పుకునే కొందరు నాదబ్రహ్మలు పాటలను ఎలా ఖూనీ చేస్తారో చూపిస్తూ చిత్రీకరించిన శుభాకాంక్షలు సినిమాలోని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శుభాకాంక్షలు (1997)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం :
గానం : మనో 

చరణ కొంకిణులు గొల్లు గొల్లుమన
కర్ర కంకణము గల్లలాడగా
ఇనీల కచభర ఇలాస బంధుర
తన్నులతిక చంచలించిపోగా
ఆడ్డవే మయూర్రే..
నటనమాడ్డవే మయ్యూర్రేయ్..
నీ కులుకులు గని నా పలుకులిరవ
నీ నటనలు గని నవ కవిత ఎలవగా
ఆడవే మయూరె.. మయూరె..మయూరే..

పాల నేత్ర సంప్రభవ జ్వాలలు
ప్రశవ శరుని దహియించగా
పతిని కోలుపడి రతీదేవి
దుఃఖితమతియై రోధించగా

హిమగిరీంధ్ర
శిఖరాగ్ర తాండవత్
ప్రమధ గణము కనిపించగా
ప్రమద నాద కర
బాంకజ భ్రాంకుత
ఢమరుధ్వని వినిపించగా
ప్రళయ కాల
సంచలిత భయంకర
జలదరార్భకుల
చలిత దిక్దటుల
చకిత దిక్కరుల
వికృత ఘీంకృతుల
సహస్ర ఫణి
సంచలిత భూకృతుల

కళ్ళలోన
కనుబొమ్మలోన
అదరాలి లోన
బెదరాలి పైన
గళ సీమ లోన
కటి దోమ లోన
కరయుగములోన
నీ మొగములోన
నీ ఒంటిలోని
ప్రతి ఇంచి లోన
అనంత ఇదములు
అభినయించి
ఇక ఆడ్డవే.. ఆడ్డవే.. ఆడ్డవే...

 

4 comments:

ఈ పాట పాడింది మనో గారు

థాంక్స్ ఎ లాట్ విద్యా సాగర్ గారు.. పోస్ట్ అప్డేట్ చేశానండీ.

నవ్వొచ్చే పాట..

హహహ అవునండీ.. ఎంతకాలమైనా నవ్విస్తూనే ఉంటుంది ఈ సీన్.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.