ఆదివారం, అక్టోబర్ 06, 2019

ఊరు కాచే ముత్తైదా...

నాగ దేవత చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నాగదేవత (2001)
సంగీతం : హంస లేఖ
సాహిత్యం :
గానం : చిత్ర

ఊరు కాచే ముత్తైదా గంగమ్మా గంగమ్మా
పదవమ్మ గంగమ్మా
మగని కాచే ముతైదా మారెమ్మ మారెమ్మ
పొదామా మారెమ్మా
మనసాటి ముతైదే వేచి ఉంది వేదనతో
పొదాము రారండి సౌభాగ్యం కనరండి
ఊరు కాచే ముత్తైదా గంగమ్మా గంగమ్మా
పదవమ్మ గంగమ్మా
మగని కాచే ముతైదా మారెమ్మ మారెమ్మ
పొదామా మారెమ్మా


ఉదయమె లేచి ప్రతి ముత్తైదు అమ్మను కాద తలిచేది
తన మదిలొని కలతలలన్ని అమ్మలకేగ తెలిపేది
నెలతలే లేకుంటె దేవుడికి నెలవేది
భక్తులే రాకుంటే గుడికి ఇక వెలుగేది
దయతొటి కుంకుమ పూలు అక్షింతలు
మనమంత ఇవ్వాలి తన తాళి నిలపాలి

తాళి కాచే ముత్తైదా యెల్లమ్మా యెల్లమ్మా
పొదామ ఎల్లమ్మ
ఉసురు కాచే ముత్తైదా నూకమ్మా నూకమ్మా
రావెచెల్లి నూకమ్మ


భర్తల మేలే మనసున కొరి వ్రతములు చేయు ప్రతి నారి
చెట్టు పుట్ట మన్ను మిన్ను మన రూపాలనె మొక్కెదరే
వారి ఆ నమ్మికయే దేవతల ఉనికమ్మ
ఆ నమ్మకమె సడలిన చో భక్తికి అర్థం లేదమ్మ
ఆశ  తొటి ముత్తైదు వేచి ఉంది మన కొరకు
పొదాము రారండి సౌభగ్యం నిలపండి

ఊరు కాచె ముత్తైదా గంగమ్మ గంగానమ్మా
మగని కాచె ముత్తైదా మారెమ్మ మారెమ్మా
తాళి కాచే ముత్తైదా యెల్లమ్మ యెల్లమ్మ
ఉసురు కాచె ముత్తైదా రావమ్మ నూకాలమ్మా
కులముకాచే ముత్తైదా పొలమ్మ పొలేరమ్మ
అభయమిచ్చే ముత్తైదా  ముత్యమ్మ ముత్యాలమ్మ 
బ్రతుకునిచ్చే ముత్తైదా అంకమ్మ అంకాళమ్మ 




2 comments:

శ్రీ దుర్గా..దేవీ నమోస్తుతే..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.