శనివారం, డిసెంబర్ 24, 2011

సాగరతీర సమీపానా

గాయకుడు తను పాడే పాటకు వన్నె తీసుకురావడమనేది సాధారణమైన విషయం. అంటే మంచి గాయకుడు పాడిన మంచిపాట మరింత బాగుంటుంది. ఐతే ఒక గాయకుడు పాడడం వల్ల ఆపాటకు మరింత ప్రాచుర్యం లభించడమన్నది ఒక్క ఏసుదాస్ గారి విషయంలోనే జరుగుతుందేమో.. ఈ పాట తను పాడడం వలనే ఇంత ప్రచారాన్ని పొందింది అనిపిస్తుంటుంది. ఐతే దానితో పాటు శ్రావ్యమైన సంగీతం కూడా ఒక కారణం అనుకోండి. ఏదేమైనా చిన్నతనం నుండి ఇప్పటికి కూడా అప్పుడపుడు ఈ పాటలో కొన్ని లైన్స్ పాడుకుంటూనే ఉంటాను. ఇక ఇదే బాణీలో కొన్ని ప్రైవేట్ ఆల్బంస్ లో వచ్చిన అయ్యప్ప పాటలు, దుర్గాదేవి  పాటలు కూడా కొన్ని చోట్ల విన్నాను. ఈ పాట వీడియో దొరకలేదు ఆడియో మాత్రమే ఉంది మీరూ మరోసారి వినండి. క్రింద ఇచ్చిన ప్లేయర్ లోడ్ అవకపోతే డైరెక్ట్ గా ఈ లింక్ కు వెళ్ళి వినండి.  


చిత్రం : మేరీమాత - 1971
సంగీతం : జి.దేవరాజన్
సాహిత్యం : అనిశెట్టి
గానం : యేసుదాస్.

సాగరతీర సమీపానా.. తరగని కావ్య సుధా మధురం
కాల చరిత్రకు సంకేతం.. కరుణకు చెరగని ప్రతిరూపం.

పచ్చని వృక్షములలరారు.. బంగరు పైరులు కనరారు.. ||2||
మాయని సిరులే సమకూరూ.. వేలాంగన్నీ అను ఊరూ.. 

సాగరతీర సమీపానా.. తరగని కావ్య సుధా మధురం
కాల చరీత్రకు సంకేతం.. కరుణకు చెరగని ప్రతిరూపం.

విరితావులనూ వెదజల్లీ.. వీచే చల్లని చిరుగాలీ ||2||
ఆవూ దూడల ప్రేమ గని.. పాడెను మమతల చిహ్నమనీ

సాగరతీర సమీపానా.. తరగని కావ్య సుధా మధురం
కాల చరీత్రకు సంకేతం.. కరుణకు చెరగని ప్రతిరూపం.

మట్టిని నమ్మిన కర్షకులూ.. మాణిక్యాలూ పొందేరూ.. ||2||
కడలిని నమ్మిన జాలరులూ.. ఘనఫలితాలు చెందేరూ.. ||2||

సాగరతీర సమీపానా.. తరగని కావ్య సుధా మధురం
కాల చరీత్రకు సంకేతం.. కరుణకు చెరగని ప్రతిరూపం.

పాలూ తేనై కలిశారూ.. అనురాగములో దంపతులూ ||2||
తోడూనీడై మెలిగారూ.. చవిచూశారూ స్వర్గాలూ..

సాగరతీర సమీపానా.. తరగని కావ్య సుధా మధురం
కాల చరీత్రకు సంకేతం.. కరుణకు చెరగని ప్రతిరూపం.

8 comments:

నేను ఇదే మొదటిసారి వినడం. చాలా బావుంది వేణు గారూ.

చాలా మంచి పాట వేణుగారు,పల్లవి చాలా నచ్చుతుంది నాకు

యేసుదాస్ గొంతులో చాలా అద్భుతంగా జాలువారుతుంది ఈ పాట,మంచి పాట సమయోచితంగా గుర్తుచేసినందుకు ధన్యవాదాలు

శ్రావ్యగారు, గీతికగారు, లతగారు, పప్పుగారు నెనర్లు.

అద్భుతం వేణు, మొదటిసారి వింటున్నాను ఈ పాటని. ఇది downloaD ఎలా చేసుకోవాలి? మీ దగ్గర రికార్డ్ ఉందా?

వేణు ఇప్పటికి ఈ పాట ఒక ఇరవైసార్లైనా వరుసగా విని ఉంటాను...చాలా చాలా నచ్చేసింది. ఏంతో ఉద్రేకంగా ఉంది...thanks for introducing this song!

జేసుదాసు చిన్నప్పుడు అమృతం తాగారో ఏంటో!

Thanks Sowmya హహహ అవును ఆయన చిన్నపుడు అమృతం తాగే ఉంటారు :)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.