క్రిస్మస్
సంధర్బంగా ఈ నెల 25 వరకూ
ఈ నాలుగు రోజులూ రోజుకొకటి చొప్పున నాకు పరిచయమున్న
క్రైస్తవ సినిమాల పాటలనూ చిన్నప్పుడు రేడియోలోనూ కొందరు స్నేహితుల ద్వారాను విన్నవాటిలో
నాకు నచ్చిన పాటలను మీకు వినిపిద్దామనుకుంటున్నాను. ఇలాంటి పాటలలో మొదటిగా బాపు గారి దర్శకత్వంలో వచ్చిన రాజాధిరాజు సినిమాలోని "రాజ్యము బలమూ" పాట వినడానికి చాలా బాగుంటుంది మహదేవన్ గారి సంగీతం వేటూరి గారి సాహిత్యాలు కూడా
ఆకట్టుకునేలా ఉంటాయి. శారద గారిపై చిత్రీకరించిన ఈ పాట వీడియో రెండు చరణాలు రెండు వీడియోలు గా దొరికాయి అవి ఇక్కడ చూడవచ్చు. ఆడియోకావాలంటే చిమటమ్యూజిక్ లో ఇక్కడ వినవచ్చు.
---
చిత్రం : రాజాధిరాజు (1980)
రచన : వేటూరి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : పి.సుశీల
రాజ్యము బలమూ
మహిమా.. నీవే నీవె..
జవము జీవమూ జీవన..
నీవే నీవే..
మరియ తనయా మధుర
హృదయా.. ||2||
కరుణామయా.. ||2||
||రాజ్యము
బలమూ||
అవసరానికీ మించీ ఐశ్వరమిస్తే..
మనిషీ కన్నూమిన్నూ కానబోడేమో..
కడుపుకు చాలినంత కబళమీయకుంటే..
మనిషి నీతీ నియమం పాటించడేమో..
మనిషి మనుగడకు సరిపడనిచ్చీ..
శాంతీ ప్రేమా త్రుప్తి నిచ్చీ.. ||2||
గుండె గుండె నీ గుడిదీపాలై..
అడుగు అడుగు నీ ఆలయమయ్యే
రాజ్యమీవయ్యా.. నీ రాజ్యమీవయ్యా..
అర్హతలేని వారికీ అధికారం ఇస్తే..
దయా ధర్మం దారి తప్పునేమో..
దారి తప్పిన వారిని చేరదీయకుంటే..
తిరిగి తిరిగి తిరగబడతారేమో..
తగిన వారికి తగు బలమిచ్చీ..
సహనం క్షమా సఖ్యతనిచ్చీ.. ||2||
తనువు నిరీక్షణ శాలై..
అణువు అణువు నీ రక్షణసేనయ్యే
బలమీవయ్యా.. ఆత్మ బలమీవయ్యా..
శిలువపైన నీ రక్తం చిందిన నాడే..
శమదమాలు శోబించెను కాదా..
నీ పునరుత్ధానంతో రక్షణ రాజిల్లీ
శోకం మరణం మరణించెను కాదా..
చావు పుటుక నీ శ్వాసలనీ..
దయా దండన పరీక్షలనీ.. ||2||
ఉనికి ఉనికి నీ వెలుగు నీడలనీ
సత్యం మార్గం సర్వం నీవనీ
మహిమ తెలుపవయ్యా.. నీ మహిమ తెలుపవయ్యా..
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
చిత్రం : రాజాధిరాజు (1980)
రచన : వేటూరి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలు, బృందం
కొత్తా దేవుడండీ కొంగొత్తా దేవుడండీ (2)
ఇతడే దిక్కని మొక్కని వాడికి
దిక్కు మొక్కు లేదండండీ (2)
బాబు రాండీ రాండీ శిశువా...
కొత్తా దేవుడండీ కొంగొత్తా దేవుడండీ అండండీ
నేలకు సొరగం దించాడండీ
దించిన సొరగం పంచాడండీ
నెత్తిన చేతులు పెడతాడండీ
నెత్తినెట్టుకొని ఊరేగండీ॥॥
||కొత్తా దేవుడండీ||
అంధర్నీ రష్కించేస్తాం అంధాలన్నీ రాసిచ్చేస్తాం
అంధర్నీ రష్కించేస్తాం అంధాలన్నీ...
శృంగారంలో ముంచీ తేల్చీ
బంగారంలో పాతేయిస్తాం
వీరే మీకు సమస్తా వీరికే మీ నమస్తా
దుష్ట రక్షణం శిష్ట శిక్షణం
చేసేయ్ చేసెయ్ మోసేయ్ మోసెయ్ (2)॥
||కొత్తా దేవుడండీ||
అప్పులు గొప్పగ చెయ్యొచ్చండి
అసలుకు ఎసరే పెట్టచ్చండి
పీపాలెన్నో తాగొచ్చండి
పాపాలెన్నో చేయొచ్చండి ॥
పాత దేవుడు పట్టిన తప్పులు
ఒప్పులకుప్పులు చేస్తాడండీ (2)
కొత్త దేవుని కొలిచిన వారికి
కొక్కొక్కొ కొదవే లేదండీ
రాండీ బాబూ రాండీ శిశువా...॥
10 comments:
అబ్బ... చాలా మంచి పాటలు.
ఎన్ని రోజులైందో. రోజులు కాదు... సంవత్సరాలైందనుకుంట ఈ పాటలు విని.
సాగర తిర సమీపాన తరగని --- సుధామధురం అని ఒక పాతపాట ఉండేది.
ధన్యవాదాలు గీతిక గారు :) నిజమే అంత తరచుగా వినే పాటలు కాదు కదా :)
కొత్తపాళి గారు, అవునండీ ఏసుదాసు గారు పాడిన పాట చాలా బాగుంటుంది అది కూడా నా కలక్షన్ లో ఉంది.
"మేరీమాత" అనే సినిమాలోది 'సాగరతీర సమీపాన' song, మీరు రాసిన రెండు songs + "మిస్సమ్మ"లో 'కరుణించు మేరీ మాత' కూడా బావుటుంది. బాపూ తీసిన రాజాధిరాజు సిన్మా కూడా బావుంటుంది. ఈ సినిమాలో నూతన్ ప్రసాద్ నటన సూపర్ !
ఇవికాక "చంద్రకాంత" అనే సింగర్ ఉండేవారు నా చిన్నప్పుడు. ఆవిడ వాయిస్ చాలా బావుంటుంది. ఆవిడ పాడిన క్రిస్మస్ సాంగ్స్, కీరవాణి చేసిన ఒక ప్రవేట్ ఆల్బం(క్రైస్తవ భక్తి గీతాలు) కూడా వినటానికి బావుంటాయి.
దొడ్లో పెద్ద బాదం చెట్టూ,చెట్టు కొమ్మల్లోంచి దూరంగా కనపడే పెద్ద పెద్దవి కంచొ,ఇత్తడో రెండు చర్చ్ గంటలు ఆదివారం 8 అయ్యేసరికి లయబధ్ధంగా మోగటం మొదలు పెట్టేవి.ఘంటానాదం ఆగినకాసేపటికి శాశ్వతమా ఈ దేహం, రక్షణ భాగ్యము పొందడి ,నడిపించు నా నావ అనే భక్తి పాటలు కాసేపు మైక్ లో మోగేవి.మీ టపా చూసిన తరువాత అలా కాసేపు చిన్నతనపు రోజుల్లోకి మానస విహారం చేసినట్టైంది.
సాగర తీర సమీపాన_______పాట నాకు చాలా ఇష్టం!(పాడిందెవరు మరీ)అది అసలు ఆ పాట భావం కూడా (సిత్యుయేషన్ తెలీదు గానీ) లలితంగా ఉంటుంది.
అలాగే కరుణించు మేరి మాతా కూడా! వేణూ..ఈ పాట ఉందా మీ లిస్టులో!
తృష్ణ గారు నెనర్లు, మీరు చెప్పిన ఆల్బంస్ ఎపుడూ వినలేదండీ.. విని చూస్తాను..
ఇందిర గారు నెనర్లు, మానస విహారం పదం భలే నచ్చేసిందండీ.. నా టపా మిమ్మల్ని బాల్యంలోకి తీసుకువెళ్ళగలిగినందుకు సంతోషం.
సుజాత గారు నెనర్లు, ఆపాటలు రెండూ కూడా ఉన్నాయండీ నా కలక్షన్ లో.
రాజ్యము, బలము పాత చాలా బావుంది. వేటూరిగారి రచన్ భలే ఉంది...అచ్చు క్రైస్తవ పాటల్లాగే ఉంది భాష. ఆనాడు పింగళిగారు ఎంత బాగా రాసారో, వేటూరి వారు కూడా అంతే బాగా రాసారు. "కడుపుకి కబళం" అని రాయడంలోనే ఉంది అసలు తమాషా :)
నెనర్లు సౌమ్యా.. నిజమే.. "మరియతనయా మధురహృదయా కరుణామయా" లైన్ కూడా భలే ఆకట్టుకుంటుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.