మంగళవారం, డిసెంబర్ 20, 2011

సువ్వీ కస్తూరి రంగా..

రమేష్ నాయుడి గారి కమ్మనైన సంగీతంలో హాయైన ఈ పాట ఒకసారి విన్నవారు ఎవరైనా మర్చిపోగలరా ? మీరూ మీడియం వాల్యూంలో పెట్టుకుని ఒకసారి వినండి. ప్రారంభంలోనే మురళీ నాదంతో పాటు వచ్చే ఆలాపన వింటూంటే అలా సాయం సంజెలో మెల్లగావీచే చల్లని గాలి శరీరాన్నీ మనసునీ తేలిక పరుస్తుంటే మెల్లగా కళ్ళుమూసుకుని ఊయలపై కూర్చున్న అనుభూతినిస్తే "సువ్వీకస్తూరి రంగా" అంటూ జానకమ్మ గారు పాట అందుకోగానే నేపథ్యంలో క్రమం తప్పకుండా ఒకే రిథమ్ లొ సాగే సంగీతం మెల్లగా మనని ఊయలలూపుతుంటే మనసు అలా అలా గాలిలో తేలిపోతుందంటే అతిశయోక్తికాదేమో. రమేష్ నాయుడి గారి సంగీతానికి నేను దాసోహమనడానికి ఈ సింపుల్ ఆర్కెస్ట్రేషన్ ఒక కారణమేమో అనిపిస్తుంటుంది. ఇక మధ్యలో పడవ నడిపే వాళ్ళ పదాలతో ’హైలెస్సా హయ్య’ అంటూ వచ్చే కోరస్ పాటకు మరింత అందాన్నిస్తుంది.  ఈ సినిమా నేను చూడలేదు ఈ పాట నేపధ్యం గురించి అస్సలు తెలీదు కానీ వినడం మాత్రం చాలా ఇష్టం.  మీరూ ఇక్కడ విని ఆనందించండి.    

చిత్రం : చిల్లరకొట్టు చిట్టెమ్మ (1977)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : దాసం గోపాలకృష్ణ
గానం : జానకి, బాలు.

సువ్వి ఆహు.. సువ్వి ఆహు.. సువ్వి.. సువ్వి..
ఆ..ఆ...ఆఅ....హోయ్..
సువ్వీ కస్తూరి రంగా.. సువ్వీ కావేటి రంగా
సువ్వీ రామాభిరామా.. సువ్వీలాలీ..
సువ్వీ కస్తూరి రంగా.. సువ్వీ కావేటి రంగా
సువ్వీ రామాభిరామా.. సువ్వీలాలీ..

హైలేసా హయ్యా.. హైలేసా హయ్యా..
హైలేసా హయ్యా.. హైలేసా హయ్యా..
అద్దమరేతిరి నిద్దురలోన ముద్దుల కృష్ణుడు.. ఓ చెలియా.. ||2||
నా వద్దకు వచ్చెను ఓ సఖియా..
సువ్వీ కస్తూరి రంగా.. సువ్వీ కావేటి రంగా
సువ్వీ రామాభిరామా.. సువ్వీలాలీ..

ఊఉహు హయ్యా.. ఊఉహు హయ్యా..
ఊఉహు హయ్యా.. ఊఉహు హయ్యా..
వంగి వంగి నను తొంగి చూచెను కొంగుపట్టుకుని లాగెనుగా.. ||2||
భల్ ఛెంగున యమునకు సాగెనుగా..
సువ్వీ కస్తూరి రంగా.. సువ్వీ కావేటి రంగా
సువ్వీ రామాభిరామా.. సువ్వీలాలీ..

అల్లావనమున కొల్లలుగా వున్న గొల్లభామలను కూడితినీ..
నే గొల్లా భామనై ఆడితిని.. నే గొల్లా భామనై ఆడితిని..

సువ్వీ కస్తూరి రంగా.. సువ్వీ కావేటి రంగా
సువ్వీ రామాభిరామా.. సువ్వీలాలీ..

సువ్వి.. ఆహూం.. సువ్వి.. ఆహుం..
నిద్దురలేచి అద్దము చూడ ముద్దుల ముద్దర ఓ చెలియా..ఆఅ....
నిద్దురలేచి అద్దము చూడ ముద్దుల ముద్దర ఓ చెలియా..
హబ్బ.. అద్దినట్టుందె ఓ సఖియా...
సువ్వీ కస్తూరి రంగా.. సువ్వీ కావేటి రంగా
సువ్వీ రామాభిరామా.. సువ్వీలాలీ..
సువ్వి.. ఆహూం.. సువ్వి.. ఆహుం..
సువ్వి.. ఆహూం.. సువ్వి.. ఆహుం..
సువ్వి.. ఆహూం.. సువ్వి.. ఆహుం..

6 comments:

ఈ పాటని ఒకట్రెండుసార్లు వినడమేగానీ పూర్తిగ తెలీదు.

చాలా బాగుంది.

ఎంత బాగుందండీ పాట..మొదటిసారి విన్నాను.. చక్కటి పాటని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

ఎంత అదృష్టం!నిన్న ద్వారం లక్ష్మిగారి పాట,ఇవాళ ఈ పాట!గురజాడ అప్పారావు గారి ముత్యాలసరాలు లోది అనుకుంటాను,గుమ్మడేడే గోపిదేవి అనే దశావతారాల పాట ఆడియో మీరేమైనా ఇవ్వగలరా?సంగీతం పాలగుమ్మిగారే అని గుర్తు.

నాకూ కొత్తే ఈ పాట.. చాలా బాగుంది వేణూ.. :)
ఇదే సినిమాలో ఇంకో పాట విన్నాను ఈ మధ్యే.. "చుక్కల్లో పెదచుక్క చందమామా.." అని... అది కూడా బాగుంటుంది..
http://www.chimatamusic.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=5325

ఇందిర గారు నెనర్లు, నేను ఎపుడూ వినలేదండీ ఆ పాటను. నెట్ లొ వెతికితే సాహిత్యం మాత్రం ఈ లింక్ లో దొరికింది ఆడియో దొరకలేదు నేను కూడా వెతకడానికి ప్రయత్నిస్తాను.
http://www.bhaavana.net/telusa/0057.html
గుమ్ముగుమ్మని పెరుగు తరచగ
కోరి విని ప్రార్థించి కృష్ణుడు
అమ్మ వెన్నే యనుచు కవ్వము
అణచి పట్టగనూ

"నమ్మరా క్రిష్ణమ్మ పెరుగులొ
నడుమ గుమ్మడు తిరుగులాడును
నమ్మకున్నను గుమ్ముగుమ్మను
నాదమిటు వినుమా

కాటబోయిన వారి పాపడు
కడవలోపల చేయి పెట్టెను
తూటుపొడిచీ కరచె గుమ్మడు
తొలగి పోవగనూ

గుమ్మడేడే గోపిదేవీ
గుమ్మడేడే కన్నతల్లీ
గుమ్మడిని పొడాచూపగదవే
అమ్మ గోపెమ్మా

సగము మృగమై హేమకశ్యపు
చంపి దానవసుతుని గాచితి
మగువరో ఇందున్న గుమ్మడి
మాటనేనెరుగా

గీతిక గారు, శిశిర గారు, మధుర గారు నెనర్లు. అవును మధురా ఈ సినిమాలో మీరు చెప్పిన పాటకూడా బాగుంటుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.