బుధవారం, డిసెంబర్ 21, 2011

జై జై రాధారమణ హరి బోల్..

ఒకే మాటని తిరగేసి మరగేసి వెనక్కి ముందుకీ లాగీ పీకి పదే పదే పాడడమే కదా భజనలంటే... అబ్బబ్బ ఓట్టి బోరు బాబు అని అనుకునే వాడ్ని కొంతకాలం క్రితం వరకూ.. అసలు పూర్తిగా చివరివరకూ వినే ఓపిక కూడా ఉండేది కాదు. కానీ మొదటిసారి బెంగళూరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలోని విశాలాక్షి మంటపంలో వందలమందితో కలిసి కూర్చుని ఈ భజనలో గొంతు కలిపినపుడు ఆశ్చర్యమనిపించింది. కృష్ణ భజనకావడమో... వందలమంది మధ్య వైబ్రేషన్స్ కారణమో కాని ఒక అవ్యక్తానుభూతికి లోనయ్యాను నాకే తెలియకుండా తన్మయత్వంతో ఊగిపోయాను. మంద్రంగా నిశ్చలంగా పారుతున్న సెలయేరులా నెమ్మదిగా మొదలయ్యే భజన రకరకాల స్థాయిలలో పెరుగుతూ చివరికొచ్చేసరికి ఉదృతంగా ఎగిరిదూకే జలపాతమై ఒళ్ళంతా పులకింప చేస్తుంది. ఈ భజన ఒక సారి మీరూ విని చూడండి. ఆడియో డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ ప్రయత్నించండి.

 జైజై రాధారమణ హరి బోల్.. 
జైజై రాధారమణ హరి బోల్..
   

4 comments:

చాలా బాగుంది వేణు గారూ.

ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్... చిన్నప్పుడెప్పుడో "చందమామ రావె..." పాట ఫ్లూట్‌ మీద విన్నది గుర్తొచ్చింది.

ఫ్లూట్‌లోని అందమే అదేమో. ఎప్పుడు విన్నా,
ఎన్నిసార్లు విన్నా, ప్రతిసారీ ఆహ్లాదంగానే ఉంటుంది.

పాట చాలా చాలా... .... బాగుంది.

వేణు గారు,శ్రమ తీసుకుని మీరు పాట వెదికి ఇచ్చినందుకు నా మనఃపూర్వక ధన్యవాదాలు.చాలాకాలంక్రితం రేడియోలో వచ్చేది.కొంచెం పెద్దపాటే!పొద్దున్నే పనులు చేసుకుంటూ చాలా ఇళ్ళల్లో పెద్దవారు పాడుతుండేవారు.సాహిత్యం నాకూ దొరికింది కానీ,ఆడియోనే దొరకలేదు.మీకు మరోమారు నా ధన్యవాదాలు.

గీతిక గారు నెనర్లు, నిజమండీ ఫ్లూట్ లోని గొప్పదనమే అంత.. మనసుకు బోలెడంత ఆహ్లాదాన్ని ఇస్తుంది.
హరే నెనర్లు :-)
ఇందిర గారు ఈ పాట గురించి చెప్పినందుకు నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలండీ సాహిత్యం బాగుంది. నాకు కూడా పాట వినాలన్న ఆసక్తి పెరిగిపోయింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.