ఆదివారం, జులై 30, 2017

ఈ గాలిలో.. ఊరేగు రాగాలలో..

నోట్ బుక్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. లిరిక్స్ వీడియోలో ఆడియో క్వాలిటీ బావుంది అది ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నోట్ బుక్ (2007)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : వనమాలి
గానం : నిత్య సంతోషిణి

ఈ గాలిలో.. ఊరేగు రాగాలలో
ఈ వేళ నా.. మనవిని వినవా
నీ ఊసులే.. నా గుండె లోగిళ్ళలో
దాచానులే.. మనసును కనవా

నాలో.. లో లోనా.. నిన్నే చూస్తున్నా
నువ్వే నేనా విడలేని శ్వాసనా
రోజూ..నీడల్లే..నిన్నే వెంటాడే
పాదం కానా..కడదాక సాగనా

ఈ గాలిలో ఊరేగు రాగాలలో
ఈ వేళ నా మనవిని వినవా

పూసే..పువ్వా..ఇది విన్నావా
కూసే..గువ్వా..ఇటుగా వాలవా
మువ్వా..నువ్వూ..దయచేసావా
పువ్వులా విరబూస్తున్నా..గువ్వలా ఎగిరొస్తున్నా
మువ్వలా నవ్వుతున్నా..నన్ను చూడవే

తెలుపరే ఇకమీదైనా..మారదా మన తీరైనా
గుండెలో ప్రేమై రానా !

ఈ గాలిలో ఊరేగు రాగాలలో
ఈ వేళ నా మనవిని వినవా
ఈ ఊసులే నా గుండె లోగిళ్ళలో
దాచానులే మనసుని కనవా

నిన్నా..మొన్నా..కలగన్నానా
నేడే..నన్నే..ఎద కవ్వించెనా
రేయీ..పగలూ..తన ధ్యాసేనా
ఇంతగా వారిస్తున్నా..చెంతకే రానంటున్నా
ఎందుకీ మనసుకు మాత్రం ఇంత యాతనా
జంటగా ముడిపెడుతున్నా
జంకితే ముడి దొరికేనా
జన్మకే బంధం కానా !

నాలో..లో లోనా.. నిన్నే చూస్తున్నా
నువ్వే విన్నా విడలేని శ్వాసనా
రోజూ..నీడల్లే..నిన్నే వెంటాడే
పాదం కానా..కడదాక సాగనా

ఈ గాలిలో ఊరేగు రాగాలలో
ఈ వేళ నా మనవిని వినవా
ఈ ఊసులే నా గుండె లోగిళ్ళలో
దాచానులే మనసుని కనవా


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.