బుధవారం, జులై 12, 2017

చెప్పవే చిరుగాలి...

ఒక్కడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఒక్కడు (2003)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఉదిత్ నారాయణ్, సుజాత 

చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళి ఓ
చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి ఓ
చూపవే నీతో తీసుకెళ్ళి

చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళి ఓ
చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి ఓ
చూపవే నీతో తీసుకెళ్ళి

ఆశ దీపికలై మెరిసే తారకలు
చూసే దీపికలై విరిసే కోరికలు
మనతో జతై సాగుతుంటే హో
అడుగే అలై పొంగుతుందీ 

ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆ చుట్టూ ఇంకా రేయున్నా
అంతా కాంతే చూస్తున్నా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ 
రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు
దిక్కులు తెంచుకు దూసుకుపోతు 
ఉంటే ఆపగలవా షికార్లు
కురిసే సుగంధాల హోళి ఓ 
చూపదా వసంతాల కేళీ
కురిసే సుగంధాల హోళి ఓ 
చూపదా వసంతాల కేళీ
 
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి

యమునా తీరాల కధ వినిపించేలా
రాధామాధవుల జత కనిపించేలా
పాడనీ వెన్నెల్లో ఈ వేళ
చెవిలో సన్నాయి రాగంలా

ఓ ఓ ఓ ఓ ఓ ఓ
కలలే నిజమై అందేలా ఊగే ఊహల ఉయ్యాల
లాహిరి లాహిరి లాహిరి తారంగాల
రాతిరి ఏటిని ఈదే వేళ
జాజిరి జాజిరి జాజిరి జానపదంలా
పొద్దే పలకరించాలి
ఊపిరే ఉల్లసంగా తుళ్ళీ
హో చూపదా వసంతాల కేళీ
ఊపిరే ఉల్లసంగా తుళ్ళీ హో
 చూపదా వసంతాల కేళీ


చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళి ఓ

చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి ఓ
చూపవే నీతో తీసుకెళ్ళి

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.