మంగళవారం, జులై 18, 2017

ఈదురుగాలికి మా దొరగారికి...

కటకటాల రుద్రయ్య చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కటకటాల రుద్రయ్య (1978)
సంగీతం : జె.వి. రాఘవులు
రచన : వేటూరి
గానం: బాలు, సుశీల

ఈదురు గాలికి మా దొరగారికి 
ఏదో గుబులు రేగింది..
ఈ చలిగాలికి మా దొరసానికి 
ఎదలో వీణ మ్రోగింది..

హహ..ఉ హు ఉహు....
హహా..ఉహూ..ఉహు ఉహు..

ఈదురు గాలికి మా దొరగారికి 
ఏదో గుబులు రేగిందీ
ఈ చలిగాలికి మా దొరసానికి 
ఎదలో వీణ మ్రోగింది..
హహ...ఉ హు ఉహు..
హహా..ఉహూ..ఉహు ఉహు..
లల లలా..హుహు హుహూ

తడిసినకొద్ది..బిగిసిన రైక 
మిడిసి మిడిసి పడుతుంటే..
నిన్నొడిసి ఒడిసి పడుతుంటే....

తడిసే వగలు రగిలే సెగలు 
చిలిపి చిగురులేస్తుంటే..
నా కలలు నిదుర లేస్తుంటే..
నీ కళలు గెలలు వేస్తుంటే..

ఈదురుగాలికి మా దొరగారికి 
ఏదో గుబులు రేగిందీ
ఈ చలిగాలికి మా దొరసానికి 
ఎదలో వీణ మ్రోగింది..

లల లలా.. ఉహు ఉహూ
హెహె హెహే.. ఉహు ఉహూ

కరిగిన కుంకుమ పెదవి ఎరుపునే 
కౌగిలి కోరుతు ఉంటే
నా పెదవులెర్రబడుతుంటే
పడుచు సొగసులే ఇంద్రధనస్సులో 
ఏడు రంగులౌతుంటే..
నా పైట పొంగులౌతుంటే..
నీ హొయలు లయలు వేస్తుంటే..

ఈదురుగాలికి మా దొరగారికి 
ఏదో గుబులు రేగిందీ
హ.. ఈ చలిగాలికి మా దొరసానికి 
ఎదలో వీణ మ్రోగింది

హహ హహా..ఉహు ఉహూ
హహ హహా..ఉహు ఉహూ
లల లలా..హుహు హుహూ
హెహె హెహే..హుహు హుహూ


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.