శనివారం, జులై 29, 2017

గాలి లోనే మాటి మాటికీ...

సత్య చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సత్య (1999)
సంగీతం : విశాల్ భరద్వాజ్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : రాజేష్

గాలి లోనే మాటి మాటికీ
వేలితో నీ పేరు రాయడం
గాలి లోనే మాటి మాటికీ
వేలితో నీ పేరు రాయడం
యెమయ్యిందో యేమిటో
నాకేమయ్యిందో యేమిటో
రాతిరంతా చందమామతో
లేని పోని ఊసులాడటం
యెమయ్యిందో యేమిటో
నాకేమయ్యిందో యేమిటో

ఒక్క సారి నిన్ను వానవొల్లో
ఆడుతుంటె చూసాను
అంత వరకు ఎప్పుడు ఆనవాలే
లేని ఊహలోన తడిసాను
ఒక్క సారి నిన్ను వాన వొల్లో
ఆడుతుంటె చూసాను
అంత వరకు ఎప్పుడు ఆనవాలే
లేని ఊహ లోన తడిసాను
మెరిసె వాన విల్లులా కలలో నువ్విలా
కొలువుండిపోతె ఇంక నిదురించేదెలా

కునుకు రాని అర్ధరాత్రిలో
కళ్ళు తెరిచి కలవరించడం
యెమయ్యిందో యేమిటో
నాకేమయ్యిందో యేమిటో

మెరిసె మాయలేడి రూపం
మంత్రం వేసి నన్ను లాగుతుంటె
ఆగుతుందా నాలో వయసు వేగం
మనస్సులో సముద్రమై
అలజడి ఎటున్నా రమ్మని
నీకోసం కోటి అలలై పిలిచే సందడి
దిక్కులంటి నీ దాటి జాడ వెతకనీ

దారి పోయె ప్రతి వారిలో
నీ పోలికలే వెతుకుతుండటం
యెమయ్యిందో యేమిటో
నాకేమయ్యిందో యేమిటో

గాలి లోనే మాటి మాటికీ
వేలితో నీ పేరు రాయడం
యెమయ్యిందో యేమిటో
నాకేమయ్యిందో యేమిటో


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.