గురువారం, జులై 20, 2017

చక్కనైన ఓ చిరుగాలి...

ప్రేమ సాగరం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమసాగరం (1983)
సంగీతం : టి. రాజేందర్
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు

చక్కనైన ఓ చిరుగాలి... ఒక్కమాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి... ఒక్కమాట వినిపోవాలి

ఉషా దూరమైన నేను... ఊపిరైన తీయలేను
గాలి.. చిరుగాలి .. చెలి చెంతకు వెళ్ళి అందించాలి
నా ప్రేమ సందేశం...

చక్కనైన ఓ చిరుగాలి... ఒక్కమాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి... ఒక్కమాట వినిపోవాలి

ఉషా దూరమైన నేను... ఊపిరైన తీయలేను
గాలి.. చిరుగాలి .. చెలి చెంతకు వెళ్ళి అందించాలి
నా ప్రేమ సందేశం...


మూసారు గుడిలోని తలుపులను
ఆపారు గుండెల్లో పూజలను
దారిలేదు చూడాలంటే దేవతను
వీలుకాదు చెప్పాలంటే వేదనను
కలతైపోయే నా హృదయం 
కరువైపోయే ఆనందం
అనురాగమీవేళ అయిపోయే చెరసాల
అనురాగమీవేళ అయిపోయే చెరసాల
అయిపోయె చెరసాల

గాలి..  చిరుగాలి..  చెలి చెంతకు వెళ్ళి
అందించాలి... నా ప్రేమ సందేశం..

నా ప్రేమ రాగాలు కలలాయె
కన్నీటి కథలన్ని బరువాయే
మబ్బు వెనక చందమామ దాగి ఉన్నదో
మనసు వెనుక ఆశలన్ని దాచుకున్నదో
వేదనలేల ఈ సమయం
వెలుతురు నీదే రేపుదయం
శోధనలు ఆగేను శోకములు తీరేను
శోధనలు ఆగేను శోకములు తీరేను
శోకములు తీరేను..

గాలి..  చిరుగాలి..  చెలి చెంతకు వెళ్ళి
అందించాలి... నా ప్రేమ సందేశం.
..

చక్కనైన ఓ చిరుగాలి.. ఒక్కమాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి.. ఒక్కమాట వినిపోవాలి

ఉషా దూరమైన నేను.. ఊపిరైన తీయలేను
గాలి.. చిరుగాలి .. చెలి చెంతకు వెళ్ళి అందించాలి
నా ప్రేమ సందేశం.. ఈ నా ప్రేమ సందేశం..
ఈ  నా ప్రేమ సందేశం

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.