సోమవారం, జులై 03, 2017

చిరుగాలి వీచెనే...

శివపుత్రుడు చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 



చిత్రం : శివపుత్రుడు (2004)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వనమాలి
గానం : ఆర్పీ.పట్నాయక్, సునీత

చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..
చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..
వెదురంటి మనసులో.... రాగం వేణువూదెనే
మేఘం మురిసి పాడేనే..


కరుకైన గుండెలో.. చిరుజల్లు కురిసెనే..
తనవారి పిలుపుతో.. ఆశలు వెల్లువాయనే
ఊహలు ఊయలూపెనే
ఆశలు వెల్లువాయనే ఊహలు ఊయలూపెనే

చినుకు రాక చూసి మది చిందులేసెనే
చిలిపి తాళమేసి చెలరేగి పోయెనే 


చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..
వెదురంటి మనసులో... రాగం వేణువూదెనే
మేఘం మురిసి పాడేనే..

తుళ్ళుతున్న చిన్ని సెలయేరు గుండెలోన పొంగి పొలమారు
అల్లుకున్న ఈ.. బంధమంతా వెల్లువైనదీ.. లోగిలంతా

పట్టెడన్నమిచ్చి పులకించే నేలతల్లి వంటి మనసల్లే
కొందరికే హృదయముంది నీ కొరకే లోకముంది
నీకు తోడు ఎవరంటూ లేరు గతములో
నేడు చెలిమి చెయి చాపే వారే బ్రతుకులో
కలిసిన బంధం. కరిగిపోదులే.
మురళి మోవి విరిని తావి కలిసిన వేళా... 


చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..
వెదురంటి మనసులో.... రాగం వేణువూదెనే
మేఘం మురిసి పాడేనే.. 

ఓ... మనసున వింత ఆకాశం మెరుపులు చిందె మనకోసం
తారలకే తళుకుబెళుకా ప్రతి మలుపు ఎవరికెరుక
విరిసిన ప్రతి పూదోట కోవెల వడి చేరేనా
రుణమేదో మిగిలి ఉంది ఆ తపనే తరుముతోంది

రోజూ ఊయలే ఊగే రాగం గొంతులో
ఏవో పదములే పాడే మోహం గుండెలో
ఏనాడూ. తోడు లేకనే .
కడలి ఒడిని చేరుకున్న గోదారల్లే...

కరుకైన గుండెలో.. చిరుజల్లు కురిసినే..
తనవారి పిలుపులో.. ఆశలు వెల్లువాయనే
ఊహలు ఊయలూపెనే
ఆశలు వెల్లువాయనే ఊహలు ఊయలూపెనే
చినుకు రాక చూసి మది చిందులేసెనే

చిలిపి తాళమేసి చెలరేగి పోయెనే...


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.