గీత చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. వీడియో అలభ్యం, ఎంబెడ్ చేసినది ఈటీవీ స్వరాభిషేకంలో బాలుగారు పాడినది ఇక్కడ చూడచ్చు.
చిత్రం: గీత (1973)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: జి.కె.మూర్తి
గానం: బాలు
పూచే పూలలోనా.. వీచే గాలిలోనా
నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే..
పూచే పూలలోన.. వీచే గాలిలోన
నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే ..
ఓ చెలీ .... ఓ చెలీ ....
నా ఊహలో నీవు ఉయ్యాలలూగేవు
నా ఊపిరై నీవు నాలోన సాగెవు
నీవు నా సర్వమే .. నీవు నా స్వర్గమే
నీవు నా సర్వమే .. నీవు నా స్వర్గమే
నీవు లేకున్న ఈ లోకమే... శూన్యమే
పూచే పూలలోన.. వీచే గాలిలోన
నీ అందమే దాగెనే.. నీ అందెలే మ్రోగెనే
ఓ చెలీ... ఓ చెలీ...
ఎన్నో జన్మల బంధము మనదీ..
ఎవ్వరు ఏమన్నా ఇది వీడనిదీ..
నీవు నా గానమె .. నీవు నా ధ్యానమే
నీవు లేకున్న ఈ లోకమే శూన్యమే
పూచే పూలలోన.. వీచే గాలిలోన
నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.