సోమవారం, మే 19, 2008

నా షోలాపూర్ చెప్పులు

ఈ పాట ముద్దమందారం సినిమా లోనిది.

నా చిన్నపుడు పెళ్ళిలో మాకు అదో పెద్ద విచిత్రం... మైక్ సెట్ ఆపరేటర్ దగ్గర పిల్లలమంతా మూగి వాడు రికార్డ్ ప్లేయర్ కి కీ ఇచ్చి పాటలు ప్లే చెస్తుంటే అబ్బురం గా చూసే వాళ్ళం... చిన్న పెద్ద రెండు సైజుల్లో రికార్డ్ లు, వాటి కవర్ల పై సినిమా బొమ్మలు, చూడటం అదో సరదా. భలే వుండేవి ఆ రోజులు.... ఏ సమస్యలు భాధ్యతలు తెలియకుండ ప్రతి పని లోను అనందాన్ని మాత్రమే అస్వాదించే రోజులు... మళ్ళీ వస్తే ఎంత బావుండునో.....
ముద్దమందారం

<p><a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/Mudda+Mandaram.html?e">Listen to Mudda Mandaram Audio Songs at MusicMazaa.com</a></p>

రచన : వేటూరి గారు అనుకుంటాను నాకు ఖచ్చితం గా తెలీదు
గానం : జిత్ మోహన్ మిత్రా
సంగీతం : రమేష్ నాయుడు (ఇది "మై కాలే హైతో క్యాహువ" అనే హిందీ పాటకి అనుకరణ)

షోలాపూర్...చెప్పులు పోయాయి...
నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ..
||నా షొలాపూర్ 2||
నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి

అరె రమణ మూర్తి పెళ్ళి.. ఇది రాదు మళ్ళీ మళ్ళీ
నవ్వాలి తుళ్ళి తుళ్ళి... అని పాడెను మళ్ళీ మళ్ళీ
మన రమణ మూర్తి పెళ్ళి.. ఇది రాదు మళ్ళీ మళ్ళీ
నవ్వాలి తుళ్ళి తుళ్ళి... అని పాడెను మళ్ళీ మళ్ళీ
ఆ సందట్లొ కన్నేసి కనిపెట్టి కాజేసాడెవడో...

నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ..
నా షోలా..షోలా..షోలాపూర్ పెళ్ళిలొ చెప్పులు పోయాయి

ఇది షోలాపూరు లెదరు..యాస్ లైట్ యాస్ ఫెదరు..
సూట్ యట్ ఎనీ వెదరు..నువు తొడిగి చూడు బ్రదరూ..||2||
అని మురిపించి మరిపించి కొనిపించాడా కొట్టోడూ...

||నా షోలాపూర్||

జత నంబరేమొ ఆరు..ధర చూస్తె ఇరవయ్యారు...
తొడిగాను ఒక్క మారు..వెళ్ళాను పాత వూరు ||2||
ఒక సారైన పాలీషు కొట్టందె కొట్టేసాడెవడో..

||నా షోలాపూర్||

నా షోలాపూర్ చెప్పులూ... పెళ్ళిలొ పోయాయి...
దొరికితే... ఎవరైనా ఇవ్వండీ...హ హ హ

4 comments:

నాతో నేను నా గురించి... సింపుల్ గా బాగుంది. ఆలోచన ఇంకా బాగుంది.
నా బ్లాగులు కుడా ఒక్కసారి చుడండి. సరదాగా ...

http://teluguvoter.blogspot.com/

http://ruchulapage.blogspot.com/

http://world4you.blogspot.com/

www.satyamaytas.blogspot.com

www.mumbairanam.blogspot.com

http://telugukichidi.blogspot.com/

http://telugurythu.blogspot.com/

http://shareprapamcham.blogspot.com/

http://ayurarogyalu.blogspot.com/

గౌతంరాజు గారు నెనర్లు. వావ్ చాలా బ్లాగ్ లు మొదలు పెట్టినట్లున్నారు కదా మెల్ల్లగా చూస్తానండీ అన్నీ...

నా షోలా..షోలా..షోలాపూర్ పెళ్ళిలొ చెప్పులు పోయాయి

అది ఇంటెన్షనల్ గానే పాడారనుకుంటానండీ లేదా పొరబాటున పాడితే బానే ఉందిలే అని ఉంచేశారో.. పాటలో మాత్రం ఇదే లైన్ ఉంది..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.