ఆదివారం, ఆగస్టు 21, 2016

కృష్ణవేణి తీరంలో...

కృష్ణవేణి తీరంలో మెరిసి మురిపించిన ప్రేయసి మళ్ళీ అదే తీరంలో కనిపిస్తే ఆ ప్రేమికుని సంతోషం ఎలా ఉంటుందో రమణగోగుల స్వరంలో మీరే వినండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన ఫ్లాష్ ప్లేయర్ లోడ్ అవకపోతే వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మౌనమేలనోయి (2002)
సంగీతం : రమణగోగుల
సాహిత్యం : వేటూరి
గానం : రమణగోగుల

Waiting for your love yeah yeah
Waiting for your love yeah yeah
I've been waiting for your love yeah yeah
I am so happy you are right next to me.

హెయ్ కృష్ణవేణి తీరంలో
సంధ్యా సమయంలో కనులా ఒక తార మెరిసే
కృష్ణ వేణు గానంలో యమునా తీరంలో
మెరిసిన తార నేడు రాధలాగ దిగివచ్చే
తుంగభద్ర తీరంలో హంపీ క్షేత్రంలో
శిలలే చిగురించి కదిలే
హెయ్ నీవులేని రాత్రుల్లో 
నిద్రపోని నేత్రంలో కలలే మిగిలే

Your dreams are all i have with me.
seen my love yeah yeah
well I've seen my love yeah yeah
well Ive seen my love yeah yeah
i am so happy she is right next to me.

అందాలలో ఎన్ని అందాలో అందాలిలే నాకు ఒక్క చూపుకే
ఆ చూపులో ఎన్ని గ్రంథాలో చదివానులే లేత కన్నెమనసుని
ఆ నడకలో ఏమి నాట్యాలో చూశానులే నే సుందరాంగిలో
అమ్మాయిలో ఎన్ని శిల్పాలో ఠీవీ.. 
ఎంటీవి.. యమ తీరి చూస్తె చాలునంట
వంశధార తీరంలో వెలిసా కుసుమంలో విరిసే విరితేనె మనసా
వాలుచూపు గానంలో వలచిన మౌనంలో
కలసిన భామ నేడు ప్రేమలాగ ఎదురొచ్చే

well I've seen my love yeah yeah
seen my love yeah yeah seen my love yeah yeah
i am so happy i am right next to her.

ఆ తారకే నేను ఆకాశం సందె వేళ పుట్టాను ఆమెకోసమే
ఆ భావనే లేత శృంగారం ఎంకి పాటనైనాను ఆమెకోసమే
ఆ నవ్వులా మల్లెజాజుల్లో వేగానులే నే విరహ జీవినై
అమ్మాయితో ఏమి చెప్పాలో Don't know don't know
i don't know what to tell her..

కృష్ణవేణి తీరంలో
సంధ్యా సమయంలో కనులా ఒక తార మెరిసే
కృష్ణ వేణు గానంలో యమునా తీరంలో
మెరిసిన తార నేడు రాధలాగ దిగివచ్చే

seen my love yeah yeah
seen my love yeah yeah
well I've seen my love yeah
i am so happy i am right next to her.
seen my love seen my love
seen my love seen my love
seen my love seen my love
 

2 comments:

రమణా గోగులది ఓ టిపికల్ స్టైల్ కదండీ..మెలొడీ పరం గా బావుంటాయి ఆయన ట్యూన్స్..

అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.