గురువారం, ఆగస్టు 25, 2016

సుధా మధురము...

మిత్రులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు.ఈ సంధర్బంగా కృష్ణప్రేమ చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన ఫ్లాష్ ప్లేయర్ లోడ్ అవకపోతే వీడియో ఇక్కడ చూడవచ్చు.



చిత్రం : కృష్ణప్రేమ (1961)
సంగీతం :  పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం : శ్రీశ్రీ
గానం : పి.బి.శ్రీనివాస్, సుశీల

సుధామధురము కళాలలితమీ సమయము
ఆహా మధురము
సుధామధురము కళాలలితమీ సమయము
ఆహా మధురము
రాగ తాళ సమ్మేళన వేళ
రాగ తాళ సమ్మేళన వేళ..
 
సుధామధురము కళాలలితమీ సమయము
ఆహా మధురము
 
పాడెనే మలయానిలం
ఆహా ఆడెనే ప్రమదావనం
ఆ ఆ ఆ ఆ
పాడెనే మలయానిలం
ఆహా ఆడెనే ప్రమదావనం
పాటలతో సయ్యాటలతో ఈజగమే మనోహరము
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

సుధామధురము కళాలలితమీ సమయము
ఆహా మధురము


రాగముల... సరాగముతో
నా మది ఏలెను నీ మురళి

అందముల... పసందులతో చిందులు వేసెను నీ సరళి
నీ కులుకే లయానిలయం
నీ పలుకే సంగీతమయం
ప్రమద గానాల ప్రణయ నాట్యాల
ప్రకృతి పులకించెనే..హ హ హ హా

సుధామధురము కళాలలితమీ సమయము
ఆహా మధురము


పదముల వాలితిని హృదయమే వేడితిని
పదముల వాలితిని హృదయమే వేడితిని
పరువపు నా వయసు మెరిసే నా సొగసు
చెలిమి పైన నివాళిగా చేకొనుమా వనమాలీ

ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నా హృదయ విహారిణివే నాట్యకళా విలాసినివే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ

సుధామధురము కళాలలితమీ సమయము
ఆహా మధురము..

 

2 comments:

వేణుజీ మీకు, మీ కుటుంబానికీ జన్మాష్టమి శుభాకాంక్షలు..

థాంక్స్ శాంతి గారు. మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.