గురువారం, ఆగస్టు 04, 2016

ఏమంటావే ఓ మనసా...

నిన్నే ఇష్టపడ్డాను చిత్రం కోసమ్ ఆర్.పి.పట్నాయక్ స్వరపరచిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : నిన్నే ఇష్టపడ్డాను (2003)
సంగీతం : ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర

ఏమంటావే ఓ మనసా నీకెందుకే ఇంత ఆశా
ఏమైందని ఓ వయసా మారిందిలా నీ వరస
వరించే కలలొచ్చి...!!! వరాలే కురిపించి
స్వరాలై నీతో చేరి పలికేయా ఈ హైలో హైలెస్సా
ఓ... ఓ... ఓ... ఓ...
ఓ... ఓ... ఓ... ఓ...

సంకోచం చాలు అని ఇంకొంచం చేరమని చోటిచ్చిందా ఈ స్నేహం
అవకాశం చూసుకొని సావాసం పంచమని అందించిందా ఆహ్వానం
చినుకంత చిన్నతడి వెంటపడి వెల్లువగ మారిందా
అణువణువు తుళ్ళి పడి గుండేసడి ఝల్లు మని మోగిందా
ఆరాటం అనురాగం తెలిపిందా బహుశా
ఓ... ఓ... ఓ... ఓ...
ఓ... ఓ... ఓ... ఓ...

మోమాటం కప్పుకొని ఏమాట చెప్పనని ఎన్నాళ్ళింకా ఈ మౌనం
జడివానై కమ్ముకొని సుడిగాలై చుట్టుకొని తరిమేయవా ఈ దూరం
ఉబలాటమున్నదని ఒప్పుకొని అందుకో నా జంట
నీ వేలు పట్టుకొని వదలనని నడపనా నా వెంట
ఆ మాటే చెబుతోంది వెచ్చని నీ శ్వాస
ఓ... ఓ... ఓ... ఓ...
ఓ... ఓ... ఓ... ఓ...

ఏమంటావే ఓ మనసా నీకెందుకే ఇంత ఆశా
ఏమైందని ఓ వయసా మారిందిలా నీ వరస
వరించే కలలొచ్చి...!!! వరాలే కురిపించి
స్వరాలై నీతో చేరి పలికేయా ఈ హైలో హైలెస్సా
ఓ... ఆ... ఓ... ఆ... ఓ... ఓ
ఆహా హా... ఓహో హో... ఆహా హా... ఆ... ఆ...


2 comments:

యేమంటామండీ..మీ వర్షం పాటల లో మేమూ సంతోషం గా తడుస్తున్నాము..

మీ ప్రొత్సాహానికి మెనీ థాంక్స్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.