శుక్రవారం, ఆగస్టు 12, 2016

మా తెలుగు తల్లికి / తెల్లావారక ముందే...

ఈరోజు నుండీ కృష్ణా పుష్కరాలు మొదలవుతున్నాయి కనుక ఈ పన్నెండు రోజులు కృష్ణమ్మను తలపించె పాటలు పాడుకుందాం. ముందుగా లీడర్ సినిమాలో ప్రకాశం బ్యారేజ్ వద్ద చిత్రీకరించిన మాతెలుగు తల్లికి పాట. పూర్తి పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు, యూట్యూబ్ లింక్ ఇక్కడ.


చిత్రం : లీడర్ (2010)
సంగీతం : మిక్కీ జె మేయర్ / టంగుటూరి సూర్యకుమారి
సాహిత్యం : శంకరంబాడి సుందరాచారి / వేటూరి
గానం : టంగుటూరి సూర్యకుమారి, కోరస్ 

వి ఆర్ ద యూత్ ఆఫ్ ది నేషన్
హై ఇన్ ద స్కై
వి ఆర్ ద న్యూ జెనరేషన్
వి ఆర్ ద యూత్ ఆఫ్ ది నేషన్
హై ఇన్ ద స్కై
వి ఆర్ ద న్యూ జెనరేషన్
లీడర్ లీడర్ లీడర్ లీడర్
లీడర్ లీడర్ లీడర్ లీడర్
 
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
కడుపులో బంగారు కను చూపులో కరుణ
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు నా తల్లి
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
 
వి ఆర్ ద యూత్ ఆఫ్ ది నేషన్
హై ఇన్ ద స్కై
వి ఆర్ ద న్యూ జెనరేషన్
వి ఆర్ ద యూత్ ఆఫ్ ది నేషన్
హై ఇన్ ద స్కై
వి ఆర్ ద న్యూ జెనరేషన్

గల గలా గోదారి కదలి పోతుంటేను
గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

కడుపులో బంగారు కను చూపులో కరుణ
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు నా తల్లి
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

వి ఆర్ ద యూత్ ఆఫ్ ది నేషన్
హై ఇన్ ద స్కై
వి ఆర్ ద న్యూ జెనరేషన్
వి ఆర్ ద యూత్ ఆఫ్ ది నేషన్
హై ఇన్ ద స్కై
వి ఆర్ ద న్యూ జెనరేషన్
లీడర్ లీడర్ లీడర్ లీడర్
లీడర్ లీడర్ లీడర్ లీడర్

ఈ కిందివి సినిమాలో ఉపయోగించని చరణాలు..

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక

రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక

నీ పాటలే పాడుతాం
నీ ఆటలే ఆడుతాం

జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ రోజు వరలక్ష్మీ వ్రతం సంధర్బంగా అతివలందరకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముత్యాల పల్లకి చిత్రం కోసం మల్లెమాల గారు వ్రాసిన ఈ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ముత్యాల పల్లకి (1970)
సంగీతం : సత్యం
సాహిత్యం : మల్లెమాల
గానం : సుశీల

తెల్లావారక ముందే పల్లే లేచిందీ
తన వారినందరినీ తట్టి లేపిందీ
ఆదమరచి నిద్ర పోతున్న తొలికోడి
అదిరి పడి మేల్కొంది అదే పనిగ కూసింది

తెల్లావారక ముందే పల్లే లేచిందీ
తన వారినందరినీ తట్టి లేపిందీ

వెలుగు దుస్తులేసుకునీ సూరీడూ
తూర్పు తలుపు తోసుకుని వచ్చాడు
పాడు చీకటికెంత భయమేసిందో
పక్క దులుపు కుని ఒకే పరుగు తీసిందీ
అది చూసీ.. లతలన్నీ.. ఫక్కున నవ్వాయి
ఆ నవ్వులే ఇంటింటా పువ్వులైనాయి

తెల్లావారక ముందే పల్లే లేచిందీ
తన వారినందరినీ తట్టి లేపిందీ

పాలావెల్లి లాంటి మనుషులు
పండూ వెన్నెల వంటీ మనసులు
మల్లె పూల రాశి వంటి మమతలూ
పల్లె సీమలో కోకొల్లలూ
అనురాగం.. అభిమానం
అనురాగం అభిమానం కవల పిల్లలూ
ఆ పిల్లలకూ పల్లెటూళ్ళు కన్న తల్లులూ

తెల్లావారక ముందే పల్లే లేచిందీ
తన వారినందరినీ తట్టి లేపిందీ 


2 comments:

ఆ అమ్మవారి దయవల్ల మీ కుటుంబం కలకాలం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము వేణూజీ..

థాంక్స్ శాంతిగారు.. మీకు కూడా పండుగ శుభాకాంక్షలు... మీరన్నవాటితో పాటుగా నిత్యం సంతోషం మీ ఇంట వెల్లి విరియాలని కోరుకుంటున్నాను.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.