భాగ్యలక్ష్మి చిత్రం కోసం ఎమ్మెస్ విశ్వనాథన్ గారి స్వర సారధ్యంలో సుశీల గారు అద్భుతంగా పాడిన ఓ కమ్మనైన పాటను ఈ రోజు తలచుకుందాం. తేట తేట తెలుగును కృష్ణ శాస్త్రి కవితతోనూ కృష్ణవేణమ్మ సొగసుతో పోల్చిన తీరు అద్భుతం. ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన వీడియో లోడ్ అవ్వకపోతే ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : భాగ్యలక్ష్మి (1984)
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాథన్
సాహిత్యం : దాసరి
గానం : సుశీల
కృష్ణశాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
కృష్ణశాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
పాలలా తేనెలా దేశభాషలందు లెస్సగా
పాలలా తేనెలా దేశభాషలందు లెస్సగా
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు
కృష్ణశాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
కృష్ణదేవరాయల కీర్తి వెలుగు తెలుగు
తెలుగూ... ఆఆ.ఆఆఆఅ.ఆఆఅ...
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాథన్
సాహిత్యం : దాసరి
గానం : సుశీల
కృష్ణశాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
కృష్ణశాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
పాలలా తేనెలా దేశభాషలందు లెస్సగా
పాలలా తేనెలా దేశభాషలందు లెస్సగా
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు
కృష్ణశాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
కృష్ణదేవరాయల కీర్తి వెలుగు తెలుగు
తెలుగూ... ఆఆ.ఆఆఆఅ.ఆఆఅ...
కృష్ణదేవరాయల కీర్తి వెలుగు తెలుగు
కాకతీయ రాజుల పౌరుషాగ్ని తెలుగు
కాకతీయ రాజుల పౌరుషాగ్ని తెలుగు
కూచిపూడి నర్తన త్యాగరాజ కీర్తన
కూచిపూడి నర్తన త్యాగరాజ కీర్తన
అడుగడుగు అణువణువు
అచ్చతెలుగు జిలుగు తెలుగు
సంస్కృతికే ముందడుగు
కాకతీయ రాజుల పౌరుషాగ్ని తెలుగు
కాకతీయ రాజుల పౌరుషాగ్ని తెలుగు
కూచిపూడి నర్తన త్యాగరాజ కీర్తన
కూచిపూడి నర్తన త్యాగరాజ కీర్తన
అడుగడుగు అణువణువు
అచ్చతెలుగు జిలుగు తెలుగు
సంస్కృతికే ముందడుగు
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు
కృష్ణశాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
పోతులూరి వీరబ్రహ్మ సూక్తులన్ని తెలుగు
పొట్టి శ్రీరాముల త్యాగనిరతి తెలుగు
పొట్టి శ్రీరాముల త్యాగనిరతి తెలుగు
కందుకూరి సంస్కారం చిలకమర్తి ప్రహసనం
కందుకూరి సంస్కారం చిలకమర్తి ప్రహసనం
నేటి తరం ముందు తరం అనుసరించు బాట తెలుగు
జాతికిదే బావుటా...
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు
కృష్ణశాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
పాలలా తేనెలా దేశభాషలందు లెస్సగా
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు
కృష్ణశాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
పాలలా తేనెలా దేశభాషలందు లెస్సగా
2 comments:
యమ్మెస్ విశ్వనాధన్ గారి స్వరకల్పన వల్ల ఈ పాట అందం వేయింతలైందండీ..
కాదనలేని సత్యం శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.