శనివారం, ఆగస్టు 20, 2016

అందాల నా కృష్ణవేణీ..

ఏసుదాసు గారి సుమధుర గళం నుండి జాలువారిన వేటూరి వారి అందమైన రచనను ఈ రోజు తలచుకుందాం. ఈ పాటను ఎక్కువ శాతం ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో చిత్రీకరించడం ఓ ప్రత్యేకత. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన ఫ్లాష్ ప్లేయర్ లోడ్ అవకపోతే వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దశతిరిగింది (1979)
సంగీతం : సత్యం
సాహిత్యం : వేటూరి
గానం : ఏసుదాస్, సుశీల

ఆఆఆ...ఆఆ..ఆఆఆ..ఆఆఅ..
అందాల నా కృష్ణవేణీ..
శృంగార రస రాజధాని..
నీ అందాలన్నీ అలలై వలలై
బంధించనీ నన్ను బంధించనీ.. 

అందాల నా కృష్ణవేణీ.. ఆహా
శృంగార రస రాజధాని.. ఆహాహహ
నీ అందాలన్నీ అలలై వలలై
బంధించనీ నన్ను బంధించనీ.. 
అందాల నా కృష్ణవేణీ..

ఆహా..హా..ఆహా..ఆహా..ఆహాహహ...

నాగార్జున నీ రసవాదంలో
రాగాలెన్నో నీలో చూశా
ఆహా..హా..ఆహా..ఆహా..ఆహాహహ
అమరావతిలో శిల్పలెన్నో
కరిగే కళలే నీలో చూశా
ఏకాంతంలో సాయంత్రంలో
ఏకాంతంలో సాయంతంలో
ఆ నదిలా కదిలి మదిలో మెదిలే
సౌందర్యమే నా సామ్రాజ్యమూ..

అందాల నా కృష్ణవేణీ.. ఆహా
శృంగార రస రాజధాని.. ఆహాహహహా

శ్రీశైలంలో శివపార్వతుల
సంగమ గీతం నీలో విన్నా..
ఆహా..హా..ఆహా..ఆహా..ఆహాహహ
శ్రీనాధునిలో కవితా ధునిలో
చాటువులెన్నో నీలో విన్నా..
మధుమాసంలో మరుమల్లికలా
మధుమాసంలో మరుమల్లికలా
తేనెలు చిలికే తెలుగందాలే
నీ సొంతమూ నువ్వు నా సొంతమూ

అందాల నా కృష్ణవేణీ.. ఆహా
శృంగార రస రాజధాని.. ఆహాహహా
నీ అందాలన్నీ అలలై వలలై
బంధించనీ నన్ను బంధించనీ.. 
అందాల నా కృష్ణవేణీ.. ఆహా
శృంగార రస రాజధాని.. ఆహాహ
 

2 comments:

కృష్ణా నది ఒడ్డున సేదతీరనట్టుందండీ ఈ పాట

బాగా చెప్పారు శాంతి గారు అందుకే ఆ ఒడ్డునే చిత్రీకరించినట్టున్నారండీ చాలాభాగం. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.