మంగళవారం, ఆగస్టు 02, 2016

అమ్మాయి ముద్దు ఇవ్వందే...

క్షణం క్షణం చిత్రం కోసం కీరవాణి గారు స్వరపరచిన ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కొవచ్చు.


చిత్రం : క్షణం క్షణం  (1991)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర

త న న న తనా
తానన తన తన నన
తన నన నన త త త

త న న న తనా
తానన తన తన నన
తన నన నన త త త

అమ్మాయి ముద్దు ఇవ్వందే
ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయీ నీ ముద్దు చెల్లించితే
అమ్మమ్మమ్మమ్మో గొడవలే

ముద్దిమ్మంది బుగ్గ
వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గేలేని సిగ్గా

ముద్దిమ్మంటే బుగ్గ
అగ్గల్లే వస్తే ఆపేదెట్ట హద్దూ పద్దు వద్దా

మోజు లేదనకు..
ఉందనుకో ఇందరిలో ఎలా మనకు
మోగిపొమ్మనకూ
చీకటిలో ఇద్దరమే ఉన్నామనుకో

చూడదా సహించని వెన్నెల 
దహించిన కన్నులా
కళ్ళు మూసేసుకో హయిగా

అమ్మాయి ముద్దు ఇవ్వందే
ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయీ నీ ముద్దు చెల్లించితే
అమ్మమ్మమ్మమ్మో గొడవలే

పారిపోను కదా
అది సరే అసలు కథ అవ్వాలి కదా
యేది ఆ సరదా
అన్నిటికీ సిద్ధపడే వచ్చాను కదా

అందుకే అటు ఇటు చూడకు
సుఖాలను వీడకు
తొందరేముందిలే విందుకు

ముద్దిమ్మంది బుగ్గ
వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గేలేని సిగ్గా
ముద్దిమ్మంటే బుగ్గ
అగ్గల్లే వస్తే ఆపేదెట్ట హద్దూ పద్దు వద్దా

అమ్మాయి ముద్దు ఇవ్వందే
ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయీ నీ ముద్దు చెల్లించితే
అమ్మమ్మమ్మమ్మో గొడవలే

ముద్దిమ్మంది బుగ్గ
వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గేలేని సిగ్గా

ముద్దిమ్మంటే బుగ్గ
అగ్గల్లే వస్తే ఆపేదెట్ట హద్దూ పద్దు వద్దా 


2 comments:

అరె వాహ్హ్..భలే పిక్ అండి..సాంగ్ యెలానూ హార్ట్ త్రోబే..

థాంక్స్ శాంతి గారు అవునండీ పాట అప్పట్లొ ఎన్ని హృదయాలను కొల్లగొట్టి ఉంటుందో :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.