శనివారం, ఆగస్టు 13, 2016

రాగం తానం పల్లవి...

శంకరాభరణం శంకరశాస్త్రి గారు కృష్ణా తరంగాలకూ రాగం తానం పల్లవులకూ ఏదో ముడి పెడుతున్నారు ఆ విశేషం ఏమిటో విందామీ రోజు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శంకరాభరణం (1980)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

రాగం తానం పల్లవి..రాగం తానం పల్లవి
నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి
రాగం తానం పల్లవి..రాగం తానం పల్లవి
నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి
రాగం తానం పల్లవి


నాద వర్తులై వేద మూర్తులై
నాద వర్తులై వేద మూర్తులై
రాగ కీర్తులై త్రిమూర్తులై
రాగం తానం పల్లవి

కృష్ణా తరంగాల సారంగ రాగాలు
కృష్ణలీలా తరింగిణీ భక్తి గీతాలు
కృష్ణా తరంగాల సారంగ రాగాలు
కృష్ణలీలా తరింగిణీ భక్తి గీతాలు

సస్యకేదారాల స్వరస గాంధారాలు
సస్యకేదారాల స్వరస గాంధారాలు

సరసహృదయ క్షేత్ర విమల గాంధర్వాలు
సరసహృదయ క్షేత్ర విమల గాంధర్వాలు
క్షీర సాగర శయన దేవ గాంధారిలో..
ఆ..ఆ..ఆ..ఆ.
క్షీర సాగర శయన దేవ గాంధారిలో
నీ పద కీర్తన సేయగ ప మా ప ద ని
రాగం తానం పల్లవి

శృతిలయలే జననీ జనకులు కాగా
భావాల రాగాల తాళాల తేలి
శృతిలయలే జననీ జనకులు కాగా
భావాల రాగాల తాళాల తేలి

శ్రీ చరణ మందార మధుపమ్మునై వాలి
శ్రీ చరణ మందార మధుపమ్మునై వాలి
నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి
నిర్మల నిర్వాణ మధుధారలే
గ్రోలి
భారతాభి నయవేద ఆ ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ.. అ

భారతాభి నయవేద వ్రత దీక్షబూని

కైలాస సదన కాంభోజి రాగాన
కైలాస సదన కాంభోజి రాగాన
నీ పద నర్తన సేయగ ప దా ని
రాగం తానం పల్లవి 
 

2 comments:

ఈ మూడూ మీ బ్లాగ్ లోనే ఉన్నాయండీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.