పుష్కరాలలో చివరి రోజైన ఈ వేళ..ఆ క్రిష్ణమ్మ,కనదుర్గమ్మ మన రాజధానినీ..మన దేశాన్నీ చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ.. ఈ స్వర హారతి.. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఈ అందమైన పాటకు అంతే అందమైన వీడియో ఎడిట్ చేసి ఇచ్చిన శాంతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంబెడ్ చేసిన ఫ్లాష్ ప్లేయర్ లోడ్ అవకపోతే వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : కృష్ణవేణి (1974)
సంగీతం : విజయ భస్కర్
సాహిత్యం : సినారె
గానం : పి. బి. శ్రీనివాస్, రామకృష్ణ, సుశీల
హే జనని కృష్ణవేణి
రాజిత తరంగవాణి
పంచ పాతక హారిణి
పరమ మంగళకారిణి
దక్షినోర్వి దివ్యవాహిని
అక్షీణ భాగ్య ప్రదాయిని
శ్రీశైల మల్లికార్జున దివ్యచరణ సంశేవిని
కనకదుర్గా భవ్య కరుణాకటాక్ష సంవర్ధిని
కనకదుర్గా భవ్య కరుణాకటాక్ష సంవర్ధిని
కృష్ణవేణి...ఆ.. కృష్ణవేణి...ఆ..
మమః ప్రశీద.. మమః ప్రశీద...
కృష్ణవేణి... కృష్ణవేణి...
కృష్ణవేణి... కృష్ణవేణి...
కృష్ణవేణి తెలుగింటి విరిబోణి...
కృష్ణవేణి నా ఇంటి అలివేణి...
కృష్ణవేణి తెలుగింటి విరిబోణి...
కృష్ణవేణి నా ఇంటి అలివేణి ...
శ్రీగిరిలోయల సాగే జాడల..
శ్రీగిరిలోయల సాగే జాడల..
విద్యుల్లతలు కోటి వికశింపజేసేవు ...
లావణ్యలతవై నను చేరువేళ..
లావణ్యలతవై నను చేరువేళ...
శతకోటి చంద్రికలు వెలిగించు కృష్ణవేణి ...
కృష్ణవేణి... తెలుగింటి విరిబోణి ...
కృష్ణవేణి నా ఇంటి అలివేణి...
నాగార్జున గిరి కౌగిట ఆగి..
నాగార్జున గిరి కౌగిట ఆగి ...
బీళ్ళను బంగారు చేలుగా మార్చేవు
ఆంధ్రావనికై అన్నపూర్ణవై
కరువులు బాపేవు..బ్రతుకులు నిలిపేవు..
నా జీవనదివై ఎదలోన ఒదిగి...
నా జీవనదివై ఎదలోన ఒదిగి...
పచ్చని వలపులు పండించు కృష్ణవేణి...
కృష్ణవేణి తెలుగింటి విరిబోణి...
కృష్ణవేణి నా ఇంటి అలివేణి...
అమరావతి గుడి అడుగుల నడయాడి...
అమరావతి గుడి అడుగుల నడయాడి...
రాళ్ళను అందాల రమణులుగ తీర్చేవు...
ఏ శిల్పరమణులు.. ఏ దివ్యలలనలు
ఏ శిల్పరమణులు... ఏ దివ్యలలనలు
ఓర్చని అందాలు దాచిన కృష్ణవేణి...
అభిసారికవై హంసలదీవిలో...
సాగర హృదయాన సంగమించేవు...
నా మేని సగమై.. నా ప్రాణసుధవై..
నా మేని సగమై.. నా ప్రాణసుధవై..
నిఖిలము నీవై నిలిచిన కృష్ణవేణి...
కృష్ణవేణి తెలుగింటి విరిబోణి...
కృష్ణవేణి నా ఇంటి అలివేణి...
2 comments:
భలేవారే వేణూజీ..మీ కృష్ణా పుష్కర యఙం లో పాల్గొనే అవకాశం కలిగినందుకు నేనే మీకు థాంక్స్ చెప్పాలి..ఇట్స్ ట్రూలీ మై ప్లెజర్..
అలా అనడం మీ మంచితనం శాంతి గారు... వీడియో నాకు చాలా నచ్చింది. థాంక్స్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.