సోమవారం, ఆగస్టు 22, 2016

మదన మోహన మాధవ...

మాధవుని కోసం రాధమ్మ ఎదురు చూసినట్లు ఆ అమ్మాయి అతని కోసం ఎదురు చూస్తుండడంతో కృష్ణా తీరం కూడా యమునా తీరమైందట. ఆ వైనమేమిటో ఈ పాటలో విని తెలుసుకుందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. పూర్తి పాట యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు. ఎంబెడ్ చేసిన ఫ్లాష్ ప్లేయర్ లోడ్ అవకపోతే వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ (2015)
సంగీతం : హరి
సాహిత్యం : రాకేందు మౌళి, వెన్నెలకంటి
గానం : ఎస్.పి .చరణ్, ప్రణవి

గాలితో వేణువే పరిచయం పొందెనే హో..
చినుకుతో పుడమికే స్నేహమే కుదిరినే హో..

మదన మోహన మాధవ మది విరిసే మధురా
ఈ రాధనే ఆరాధించగ మొదలీ కథరా..
మదన మోహన మాధవ మది విరిసే మధురా
ఈ రాధనే ఆరాధించగ మొదలీ కథరా..

కలయికే చెలిమయే కల యికా నిజమయే
కృష్ణ యమునా తీరమయే
రుతువులే స్వరములై స్వరములే ఎనిమిదై
కృష్ణ గీతిక పాడెనులే

మదన మోహన మాధవ మది విరిసే మధురా
ఈ రాధనే ఆరాధించగ మొదలీ కథరా..

పలకరించెను చూపులే పరితపించెను ఆశలే
తొలకరించిన నవ్వులే విని తరించెను గాలులే
కొండ దారులలో పండువెన్నెలలే
వెండి వానలలో గుండె పండుగలే

అల వలే ఎగసినా కల వలే కరిగినా
నిన్నుకలిసే సమయానా
రుతువులే స్వరములై స్వరములే ఎనిమిదై
కృష్ణ గీతిక పాడెనులే

మనసిలా నీ వశం తెలియనీ కలవరం హో..

ఎదురుచూపుల ఆమని ఎదురుపడెనే ప్రేమని
ఎదలయల్లో ఎదగనీ ఎదిగి వచ్చిన తరుణిని
అలల ఆవిరులే మేఘమాలయెలే..
కడకు జారునిలె కడలి చినుకువలె
కలవరం మనసుకె పెంచెనీ ప్రియసఖే
మోహనుడు ఈ రాధికకే
వలపనే కోరికే తెలిపెనీ తారకే
మోహనుడు ఈ రాధికకే

మదన మోహన మాధవ మది విరిసే మధురా
ఈ రాధనే ఆరాధించగ మొదలీ కథరా..
 
 

2 comments:

కృష్ణమ్మ ఓ ప్రేమజంట కోసం రాధా మాధవులని తాకిన యమునమ్మా లా మారడం..భలే అందమైన భావన కదా..

అవును శాంతి గారు నాక్కూడా ఛాలా నచ్చింది ఆ భావన. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.