కథానాయకుడు చిత్రం కోసం సుశీల గారు గానం చేసిన దాశరథి గారి రచనను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ముత్యాల జల్లు కురిసే
ఎనక జన్మల నా నోములన్నీ
ముత్యాల జల్లు కురిసే
ముద్దు మోమును అద్దాన చూపి
ముత్యాల జల్లు కురిసే
చిత్రం : కథానాయకుడు (1969)
సంగీతం : టి.వి. రాజు
సాహిత్యం : దాశరథి
గానం : సుశీల
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ముత్యాల జల్లు కురిసే
రతనాల మెరుపు మెరిసే
వయసు మనసు పరుగులు తీసే.. అమ్మమ్మా..
ముత్యాల జల్లు కురిసే
రతనాల మెరుపు మెరిసే
వయసు మనసు పరుగులు తీసే.. అమ్మమ్మా..
ఎనక జన్మల నా నోములన్నీ
ఇప్పుడు పండినవమ్మా..ఆ..ఆ..ఆ..
ఎనక జన్మల నా నోములన్నీ
ఇపుడు పండినవమ్మా
తనకు తానై నా రాజు నాతో
తనకు తానై నా రాజు నాతో
మనసు కలిపేనమ్మా..
ముత్యాల జల్లు కురిసే
రతనాల మెరుపు మెరిసే
వయసు మనసు పరుగులు తీసే.. అమ్మమ్మా..
ముద్దు మోమును అద్దాన చూపి
మురిసిపోయాడమ్మా..ఆ..ఆ..
ముద్దు మోమును అద్దాన చూపి
మురిసిపోయాడమ్మా
మల్లెపూల పల్లకిలోనా
ఒళ్ళు మరిచేనమ్మా..
మల్లెపూల పల్లకిలోనా
ఒళ్ళు మరిచేనమ్మా..ఆ..ఆ..
ముత్యాల జల్లు కురిసే
రతనాల మెరుపు మెరిసే
వయసు మనసు పరుగులు తీసే.. అమ్మమ్మా..
2 comments:
అమ్మమ్మా..భలే పాటండీ..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.