ప్రియా ఓ ప్రియా చిత్రం కోసం కోటి గారు స్వరపరచిన ఓ చక్కని ప్రేమ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. కింద ఎంబెడ్ చేసిన వీడియో లోడ్ కాని వాళ్ళు పాటను ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ప్రియా ఓ ప్రియా (1997)
సంగీతం : కోటి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర
వాన వాన వానా వాన
వాన వాన వానా వాన
చిటపటచినుకుల వాన
చిగురాశ రేపె నాలోనా
వాన వాన వానా వాన
చలి చలి స్వరముల వీణ
యదలోన చిలిపి థిల్లానా
వాన వాన వానా వాన
ఏవేవో కొత్త ఊహలు
ఎన్నెన్నో కొంటె ఊసులు
ఆహ్వానం పాడుతున్న
లయలోనా చిలిపిగ చేరనా
వాన వాన వానా వాన
వాన వాన వానా వాన
చిటపటచినుకుల వాన
చిగురాశ రేపె నాలోనా
చలి చలి స్వరముల వీణ
యదలోన చిలిపి థిల్లానా
నీటి మంటతో లేత ఒంటిలో
తీగ ఈడు వేగుతున్న వింత చూడనా
కోడె జంటల వేడి మంటకు
సోయగాల పాయసాల విందు చేయనా
ఊరించే అందమందనా
ఊపిరితో ఊదుకొందునా
కళ్ళారా ఆరగించమంటే
పరుగున వాలనా..
చిటపటచినుకుల వాన
చిగురాశ రేపె నాలోనా
చలి చలి స్వరముల వీణ
యదలోన చిలిపి థిల్లానా
చిమ్మచీకటి సమ్మతించెలే
కమ్మనైన సంగతేదొ విన్నవించనా
తిమ్మిరేవిటో కమ్ముకుందిలే
నమ్మరాని సంబరాన నిన్ను తేల్చనా
జల్లేమో వంతెనేయగా
పిల్లేమో సొంతమాయెగా
లవ్లీగా చెంత చేరుకుని
నా తహ తహ పంచనా..
చిటపటచినుకుల వాన
చిగురాశ రేపె నాలోనా
వాన వాన వానా వాన
చలి చలి స్వరముల వీణ
యదలోన చిలిపి థిల్లానా
వాన వాన వానా వాన
ఏవేవో కొత్త ఊహలు
ఎన్నెన్నో కొంటె ఊసులు
ఆహ్వానం పాడుతున్న
లయలోనా చిలిపిగ చేరనా
వాన వాన వానా వాన
వాన వాన వానా వాన
2 comments:
అబ్బా..భలే ఉంది వెణూజీ ఈ పిక్..పాటకి తగినట్టుగా..
థాంక్స్ శాంతి గారు :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.