శనివారం, ఆగస్టు 27, 2016

జిల్ జిల్ జిల్ వాన...

యువన్ శంకర్ రాజా స్వరపరచిన ఒక హుషారైన వాన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఫ్లాష్ ప్లేయర్ లోడ్ అవని వాళ్ళు వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కలిసుంటే (2005)
సంగీతం : యువన్ శంకర్ రాజా
సాహిత్యం :
గానం : సత్యన్, చిన్మయి

జిల్ జిల్ జిల్ జిల్ వానా ఎక్కడ ఉన్నావు..
నువ్వెక్కడ్నుంచి ఎక్కడ్నుంచి ఇక్కడికొచ్చావు
నేడే నేడే నీ పుట్టినరోజంటా
కదిలే నదివై నువ్ మెట్టిన రోజంటా

జిల్ జిల్ జిల్ జిల్ వానా ఎక్కడ ఉన్నావు..
నువ్వెక్కడ్నుంచి ఎక్కడ్నుంచి ఇక్కడికొచ్చావు
నేడే నేడే నీ పుట్టినరోజంటా
కదిలే నదివై నువ్ మెట్టిన రోజంటా

జిల్ జిల్ జిల్ చినుకులు నీపై
జల జల జల రాలెను
జర జర జర ఒణుకులు నీలో
గిలి గిలి రేపెను రేపెను
బే..బెబె..జడిపించెను ఈ వర్షం..
తై.. తైతై చిందేసెను ఆ మేఘం..

జిల్ జిల్ జిల్ జిల్ వానా ఎక్కడ ఉన్నావు..
నువ్వెక్కడ్నుంచి ఎక్కడ్నుంచి ఇక్కడికొచ్చావు

ఎవరక్కడ నింగిలో టపాసులు పెట్టెను
చిటపటమను వానకే ఢామ్మని పేలెను
వరహాల జల్లులు వరదాయే మెల్లగా
పరువాలా జల్లులు సరదాలే చల్లగా
విరివాన వివరిస్తావా నాకోసం నువ్ తరలొచ్చావా

దా..దాదా.. తెగ అల్లరి చేద్దాంరా..
రా..రారా.. హరివిల్లుని తీసుకురా..

మెరుపుల్నే తుంచుదాం.. అవి నీజడ క్కుచ్చుదాం
భామా నువు కదలిరా వల్లప్పా ఆడదాం
రాత్రంతా తుళ్ళుదాం..పగలంతా సోలుదాం..
అందాల పడుచుకే ఆనందం పంచుదాం
పన్నెండు గంటల పైనా ఏ ఒక్కరికీ భయమే లేదా
జో.. జోజో.. జోకొట్టేను జలపాతం
హో.. హోహో.. ఇది రాతిరి కోలాటం.. 

జిల్ జిల్ జిల్ జిల్ వానా ఎక్కడ ఉన్నావు..
నువ్వెక్కడ్నుంచి ఎక్కడ్నుంచి ఇక్కడికొచ్చావు 
 

2 comments:

సరదా పాట..ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు వర్షం పడుతుంటే వినడానికి బావుంటుంది..

అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.