విదేశాలనుండి వచ్చి ఈ పవిత్ర భూమి సంస్కృతిని మెచ్చిన అతివలెందరో ఉన్నారు. అలా తెలుగింటి కోడలైన ఓ అమ్మాయిని ఉద్దేశించి ఇక్కడి ప్రాంతాల విశిష్టతను తెలుపుతూ పాడిన అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన ఫ్లాష్ ప్లేయర్ లోడ్ అవకపోతే వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : విచిత్ర కుటుంబం (1969)
సంగీతం : టి.వి. రాజు
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల
రష్యాలో పుట్టి భారతావనిలో మెట్టి
తెలుగువారి కోడలివై వలపులొలుకు జాజిమల్లి
వలపులొలుకు జాజిమల్లి
ఆడవే.. ఆడవే..
ఆడవే జలకమ్ములాడవే
ఆడవే జలకమ్ములాడవే..
కలహంస లాగా జలకన్య లాగా..
కలహంస లాగా జలకన్య లాగా
ఆడవే....ఏఏ....ఆడవే
ఆదికవి నన్నయ్య అవతరించిన నేల...
ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ..
తెలుగు భారతి అందియలు పల్కె ఈ నేల
ఆంధ్రసంస్కృతికి తీయని క్షీరధారలై
జీవకళలొల్కు గోదావరి తరంగాల
ఆడవే..ఏఏ..ఆడవే..ఏ...
నాగార్జునుని భోధనలు ఫలించిన చోట
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
బౌద్ధమతవృక్షంబు పల్లవించిన చోట
బుద్ధం శరణం గఛ్చామి...
ధర్మం శరణం గఛ్చామి...
సంఘం శరణం గఛ్చామి...
కృష్ణవేణీ తరంగిణి జాలిగుండెయె సాగరమ్మై
రూపు సవరించుకొను నీట...
ఆడవే....ఏఏ....ఆడవే
కత్తులును ఘంటములు... కదను త్రొక్కినవిచట
కత్తులును ఘంటములు... కదను త్రొక్కినవిచట
అంగళ్ళ రతనాలు... అమ్మినారట యిచట
నాటి రాయల పేరు నేటికిని తలపోయు
తుంగభద్రానదీ తోయమాలికలందు
ఆడవే....ఏఏ....ఆడవే
ఆడవే..ఆడవే ..ఆడవే జలకమ్ములాడవే
ఆడవే జలకమ్ములాడవే ..
మిత్రులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు.
2 comments:
తెలుగు తల్లి అందాలకి అద్దం పట్టిన పాట..మాకందరికీ చాలా ఇష్టమైన పాట వేణూజీ..
అవునండీ బాగా చెప్పారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.