మంగళవారం, ఆగస్టు 09, 2016

కురిసింది వానా...

సత్యం గారు స్వరపరచిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కొవచ్చు. ఎంబెడ్ చేసిన వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బుల్లెమ్మ బుల్లోడు (1972)
సంగీతం : సత్యం
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, సుశీల

కురిసింది వానా.. నా గుండెలోనా
నీ చూపులే జల్లుగా
కురిసింది వానా.. నా గుండెలోనా
నీ చూపులే జల్లుగా
ముసిరే మేఘాలు.. కొసరే రాగాలు
కురిసింది వానా.. నా గుండెలోనా
నీ చూపులే జల్లుగా

అల్లరి చేసే.. ఆశలు నాలో
పల్లవి పాడేనూ..ఊ..ఊ
తొలకరి వయసు.. గడసరి మనసు
నీ జత కోరేనూ..ఊ..ఊ
అల్లరి చేసే.. ఆశలు నాలో
పల్లవి పాడేను..
చలి గాలి వీచే.. గిలిగింత తోచే

కురిసింది వానా.. నా గుండెలోనా
నీ చూపులే జల్లుగా

ఉరకలు వేసే.. ఊహలు నాలో
గుసగుస లాడేనూ..ఊ..ఊ
కథలను తెలిపే.. కాటుక కనులు
కైపులు రేపేనూ..ఊ..ఊ
ఉరకలు వేసే.. ఊహలు నాలో
గుసగుస లాడేను
బిగువు ఇంకేలా.. దరికి రావేలా

కురిసింది వానా.. నా గుండెలోనా..
నీ చూపులే జల్లుగా

4 comments:

బైట చల్లగా వర్షం పడుతుంటే..వేడిగా మిర్చి బజ్జీలు తింటూ హాపీ గా వినే పాట..

హహహ భలే చెప్పారు శాంతి గారు :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.

https://youtu.be/hGfR3eHtzcY
original song link

మెనీ థాంక్స్ అంబరీష గారు.. మీరు ఇచ్చిన లింక్ పోస్ట్ లో అప్డేట్ చేశానండీ.. ఒరిజినల్ వీడియో చూడడం బావుంది..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.