గురువారం, ఆగస్టు 11, 2016

వానజల్లు వంటిమీద...

హాయ్ సుబ్రహ్మణ్యం చిత్రం లోని ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : హాయ్ సుబ్రహ్మణ్యం (2005)
సంగీతం :శ్రీకాంత్ దేవా
సాహిత్యం : 
గానం : 
 
వానజల్లు వంటిమీద వచ్చి వాలిపొయే
చినుకు తాకి చిన్నదేమో చిందులేసి ఆడే
వాయిద్యాలు లేకుండా వెన్నుమీటీ సంగీతం సాగే సాగే
సరిగమ సంగీతం వయసు గీతం పలికించె నాలో
పరవశమై పరవశమై
మనసంతా మైమరపై వర్షంలో ఊ..వావ్..ఊ..

చిటపట చిటపట చిరుజల్లు కురిసే
సయ్య సక్క సయ్య సక్క సోకు వెల్లి విరిసే
చిట్టి చిట్టి ఆశలేవో తట్టిలేపి గుట్టుగా తహ తహ రేపే
మత్తు మత్తు బిడియాలే ముద్దుకొరి మెత్తగా మనసు దోచె
తుమ్మెదలై తుంటరిగా తడిమెనులే.. వావ్ ఊ.వాహా
తుమ్మెదలై తుంటరిగా తడిమెనులే.. వావ్ ఊ.వాహా

చిటపట చిటపట చిరుజల్లు కురిసే
సయ్య సక్క సయ్య సక్క సోకు వెల్లి విరిసే
చిట్టి చిట్టి ఆశలేవో తట్టిలేపి గుట్టుగా తపన రేగే
మత్తు మత్తు బిడియాలే ముద్దుకొరి మెత్తగా మనసు దోచె


4 comments:


చిటపట చిటపట చిరు జ
ల్లు టపటప కురిసె చెలువ కలువలు విరిసెనూ !
పిటపిట లాడిన వయసున
వటువును దరి దీసెనోయి వలపుల వేణీ !

జిలేబి

యెప్పుడూ వినలేదండీ..థాంక్స్ ఫర్ యే నైస్ సాంగ్..

థాంక్స్ జిలేబి గారు..

థాంక్స్ శాంతి గారు.. ఈ సినిమా కాని పాటలు కాని రిలీజ్ అయినట్లు కూడా చాలామందికి తెలీదండీ అందుకే విని ఉండరు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.