మన కృష్ణవేణమ్మ ప్రేమ రాయభారాలను కూడా నడిపిందటండోయ్.. ఆ వైనమేమిటో మరి మహదేవన్ గారి స్వర సారధ్యంతో ఆత్రేయ గారి సాయంతో ఆ ప్రేమజంట పాడుకుంటున్నారు మనమూ విందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : బంగారు బొమ్మలు (1977)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, సుశీల
నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ...
నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ...
నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...
కనకదుర్గ కనుసన్నలలో గలగల పారే తన ఒడిలో
కనకదుర్గ కనుసన్నలలో గలగల పారే తన ఒడిలో
మన పడవలు రెండూ పయనించాలని
బ్రతుకులు నిండుగ పండించాలని
కలిపింది ఇద్దరినీ... కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
నీ కురుల నలుపులో... నీ కనుల మెరుపులో
అలలై... కలలై... అలలై కలలై తానే వెలిసింది
నీ లేత మనసులో... నీ దోర వయసులో
వరదై... వలపై... వరదై వలపై తానే ఉరికిందీ
చిరుగాలుల తుంపరగా... చిరునవ్వుల సంపదగా
చిరుగాలుల తుంపరగా... చిరునవ్వుల సంపదగా
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ...
నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
పంట పొలాల్లో పచ్చదనంగా పైరగాలిలో చల్లదనంగా
పంట పొలాల్లో పచ్చదనంగా పైరగాలిలో చల్లదనంగా
పల్లెపదంలో తీయదనంగా
చిరంజీవులై జీవించాలని
కలిపింది ఇద్దరినీ... కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ...
నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
2 comments:
హుషారైన పాటండీ..
అవును శాంతి గారు థాంక్స్ ఫర్ ద కామెంట్..:-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.