సోమవారం, ఆగస్టు 15, 2016

గంగా యమునా తరంగాలతో...

మిత్రులందరకూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరపురాని కథ చిత్రం కోసం కొసరాజు గారు రచించిన ఓ చక్కని పాటను నేడు తలచుకుందాం. అన్ని ప్రాంతాలనూ కలుపుతూ అఖండ భారతవని గురించి సాగే ఈ పాట చాలా బాగుంటుంది. ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మరపురాని కథ (1967)
సంగీతం : టి.చలపతిరావు
సాహిత్యం : కొసరాజు
గానం : ఘంటసాల

గంగా యమునా తరంగాలతో
సుందర నందన మధువనాలతో
సౌభాగ్యముతో కళకళలాడే
ఎంత చక్కనిది మనదేశం
ఎంత చక్కనిది మనదేశం

గంగా యమునా తరంగాలతో
సుందర నందన మధువనాలతో
సౌభాగ్యముతో కళకళలాడే
ఎంత చక్కనిది మనదేశం
ఎంత చక్కనిది మనదేశం

కన్నుచెదురు పంజాబు గోధుమల
చెన్నపురికి అందించెదము
కన్నుచెదురు పంజాబు గోధుమల
చెన్నపురికి అందించెదము
నేయిగారు నెల్లూరు బియ్యమును
నేయిగారు నెల్లూరు బియ్యమును
నేస్తముగా చెల్లించెదమూ
నేస్తముగా చెల్లించెదమూ

కాశ్మీరున గల కమ్మని కస్తూరి
గంపల కొలదిగ తెచ్చెదమూ
కాశ్మీరున గల కమ్మని కస్తూరి
గంపల కొలదిగ తెచ్చెదమూ
మైసూరున గల చందన గంధము
మైసూరున గల చందన గంధము
బహుమానముగా పంచెదమూ
బహుమానముగా పంచెదమూ

బ్రహ్మపుత్ర కావేరి నధులకు
బాంధవ్యమ్మును కలిపెదము
బాంధవ్యమ్మును కలిపెదము
కులమత బేధములరయక శ్రమతో
కులమత బేధములరయక శ్రమతో
బంగారము పండించెదమూ
బంగారము పండించెదమూ

గంగా యమునా తరంగాలతో
సుందర నందన మధువనాలతో
సౌభాగ్యముతో కళకళలాడే
ఎంత చక్కనిది మనదేశం
ఎంత చక్కనిది మనదేశం
 


2 comments:

ఈ పాట చూసి చాల కాలమైంది..కృష్ణ చాలా అందంగా ఉంటారు..యాప్ట్ సాంగ్ ఫర్ టుడే..

నిజమేనండీ కృష్ణ గారికి భలే సూట్ అయింది ఆ గెటప్.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.