సోమవారం, ఆగస్టు 08, 2016

ఒక్కసారి చెప్పలేవా...

నువ్వు నాకు నచ్చావ్ చిత్రం కోసం కోటి స్వరకల్పనలొ సిరివెన్నెల గారు రాసిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కొవచ్చు.


చిత్రం : నువ్వు నాకు నచ్చావ్ (2001)
సంగీతం : కోటి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కుమార్ సాను, చిత్ర

ఒక్కసారి చెప్పలేవా.. నువ్వు నచ్చావని..
చెంత చేరి పంచుకోవా.. ఆశనీ శ్వాసని..
మన గుండె గుప్పెడంత.. తన ఊహ ఉప్పెనంత..
ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుతున్న వేళ..

వెన్నెలేదో.. వేకువేదో.. నీకు తెలుసా మరి!
నిదురపోయే మదిని గిల్లి.. ఎందుకా అల్లరి!

చందమామ మనకందదని
ముందుగానే అది తెలుసుకుని
చేయి చాచి పిలవద్దు అని
చంటిపాపలకు చెబుతామా!
లేని పోని కలలెందుకని
మేలుకుంటే అవి రావు అని
జన్మలోనే నిదరోకు అని
కంటిపాపలకు చెబుతామా!
 కలలన్నవి కలలని నమ్మనని
అవి కలవని పిలవకు కలవమని..
మది మీటుతున్న మధురానుభూతి
మననడిగి చేరుతుందా!

 
ఒక్కసారి చెప్పలేవా.. నువ్వు నచ్చావని..
చెంత చేరి పంచుకోవా.. ఆశనీ శ్వాసని..

 
అందమైన హరివిల్లులతో
వంతెనేసి చిరుజల్లులతో
చుక్కలన్ని దిగి వస్తుంటే
కరిగిపోని దూరం ఉందా!
 అంతులేని తన అల్లరితో
అలుపు లేని తన అలజడితో
కెరటమెగిరి పడుతూ ఉంటే
ఆకాశం తెగి పడుతుందా!

మనసుంటే మార్గం ఉంది కదా
అనుకుంటే అందనిదుంటుందా
 
అనుకున్నవన్ని మనకందినట్టే
అనుకుంటే తీరిపోదా!

ఒక్కసారి చెప్పలేవా.. నువ్వు నచ్చావని..
చెంత చేరి పంచుకోవా.. ఆశనీ శ్వాసని..
మన గుండె గుప్పెడంత.. తన ఊహ ఉప్పెనంత..
ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుతున్న వేళ


4 comments:

ఈ మూవీ లో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు దిల్ తో పాగల్ హై మూవీ గుర్తొస్తుందండీ..ఎక్సెప్ట్ ఫర్ కుమర్ సాను వాయిస్(ఇన్ తెలుగు)..హాంటింగ్ ట్యూన్..

ఈ సినిమాలొ కామెడీ ముందు మిగిలినవి అన్నీ కొట్టుకుపోయాయండీ.. నాకైతె ఇంకే సినిమా గుర్తు రాలేదు. థాంక్స్ ఫర్ ద కామెంట్.

Okka suhasini character konchem over action chestundi tappa migatha cinema antha superb. Hero character kanipistunde tappa venkatesh kanipinchadu. songs anni manchi melodies. Sunil, MS Prakashraj sangathi cheppalsina avasarame ledu.

చాలా కరెక్ట్ గా చెప్పారు అశోక్ గారు థాంక్స్ ఫర్ ద కామెంట్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.