బుధవారం, ఆగస్టు 31, 2016

నీలి మేఘాలు...

సొగసు చూడ తరమా చిత్రం కోసం సిరివెన్నెల గారు రాసిన ఓ అపురూపమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన వీడియో లోడ్ కాకపోతే ఆ వీడియో ఇక్కడ చూడవచ్చు.





చిత్రం : సొగసు చూడ తరమా (1995)
సంగీతం : రమణి-ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం : బాలు, సుజాత, రోహిణి

నీలిమేఘాలు..
నీలిమేఘాలు ఆకాశవీధిలో ఆడుకునే మెరుపుకన్నె
నీలిమనే అమ్మాయే ఈ నేలకు వచ్చేసిందని
ఆమెను అన్వేషిస్తూ వచ్చిన దివిదూతలు

నీలిమేఘాలు..
నీలిమేఘాలు.. ఉరుముతున్న గొంతులెత్తి దిగంతాల్ని పిలుస్తూ
ఆమె కొరకు బహుమతిగా హరివిల్లుని చూపిస్తూ
నీలిమా నీలిమా అని కలవరించే నీలాంబరి రాగాలు

నీలిమేఘాలు..
నీలిమేఘాలు.. చల్లని స్నేహపు జల్లుల చిరుగాలుల చేతులతో
ఆమె మేని వయ్యారాల సీమనంతా స్పర్శిస్తూ
చిరకాలపు నేస్తానికి చేరువైన సరాగాలు

టట్టటార టట్టటారర టారట్టటార
టట్టటార టట్టటారర టారట్టటార

ఆకాశంలో నీలిమబ్బులై ఊరేగే ఊహలు
అమ్మనువదిలి ఆకతాయిలై పరిగెత్తే పాపలు
అవి చిరుజల్లుల్లో చిట్టిచినుకులై తిరిగొచ్చే వేళ
తను చిగురిస్తుంది పులకరింతలై నాగుండెల నేల

టట్టటార టట్టటారర టారట్టటార
టట్టటార టట్టటారర టారట్టటార

కుదురుగ ఉంటే మంచుబొమ్మలా ఊగిపోదా హృదయం
కులికందంటే వనమయూరిలా ఆగిపోదా కాలం

టట్టటార టట్టటారర టారట్టటార
టట్టటార టట్టటారర టారట్టటార

కల్లోకొచ్చి కోటితారలు కవ్విస్తాయెందుకో
తళతళలన్నీ కోసుకొమ్మని ఊరిస్తాయెందుకో
నే చిటికెలుకొడితే తారలు మొత్తం తలవంచుకు రావా
నా పెరటితోటలో మంచుబొట్లుగా కల నిజమే కాదా

టట్టటార టట్టటారర టారట్టటార
టట్టటార టట్టటారర టారట్టటార

గాలికి ఊగే జాజితీగలా నాజూకు జాణ
గగనాన్నైనా నేలకు దించే ఈ శ్రావణ వీణ

టట్టటార టట్టటారర టారట్టటార
టట్టటార టట్టటారర టారట్టటార

ఎల్లలులేని గాలిపటంలా ఎగిరేటి కోర్కెలు
జాబిలితోనే ఊసులాడుతూ రాసుకున్న లేఖలు
అవి దారంతెగితే తీరం లేని ఆవారా ఆశలు
ఆధారం ఉంటే అష్టదిక్కులు పాలించే రాణులు

టట్టటార టట్టటారర టారట్టటార
టట్టటార టట్టటారర టారట్టటార

లావణ్యాన్నే చూపగలిగిన అంతటి రవివర్మ
ఆంతర్యంలో అంతుదొరకని సొగసు చూపతరమా

టట్టటార టట్టటారర టారట్టటార
టట్టటార టట్టటారర టారట్టటార


4 comments:

సొగసైన పాట..మామూలుగా ఇంద్రజ అంత నచ్చదండీ..బట్ ఈ మూవీలో ..ఈ పాట లోనూ చాలా అందంగా ఉందీ అమ్మాయి..

అవునండీ ఇంద్రజ తర్వాత చేసిన సినిమాలు చూస్తే ఆ అమ్మాయేనా అని ఆశ్చర్యపొయేట్లు ఉంటాయ్.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

Ee song paadindi sujatha mohan.. SP Sailaja kaadu. Please check

థాంక్స్ అజ్ఞాత గారు సరిచేశాను..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.