గురువారం, సెప్టెంబర్ 01, 2016

ఎవరో..అతనెవ్వరో..

అభి చిత్రం కోసం దేవీశ్రీప్రసాద్ స్వరపరచిన ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటె ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లొడ్ చేస్కోవచ్చు. వీడియో దొరకలేదు ఎంబెడ్ చేసినది జ్యుక్ బాక్స్ అది లోడ్ అవని వాళ్ళు ఇక్కడ వినవచ్చు. 

 

చిత్రం : అభి (2004)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : వేటూరి
గానం : సాగర్, సుమంగళి

ఎవరో..అతనెవ్వరో..అతిధిగ వచ్చాడూ
నిదరే పోతున్న నా ఎదనే కదిపాడూ
ఎవరో..తను ఎవ్వరో..ఎదురే వచ్చిందీ
వివరం ఏం చెప్పనూ..విరహం రేపిందీ

తెలవారే వేళా..కలగన్నా తననే..
అది ప్రేమో ఏమో..ఏమిటో

ఎవరో..తను ఎవ్వరో..ఎదురే వచ్చిందీ
నిదరే పోతున్న నా ఎదనే కదిపాడూ

అణువణువు అతని తలపే వేధించసాగే
అనుదినమూ అతని కధలే వినిపించెనే
చెలి మనసు అడిగి మనసు వెంటాడ సాగే
తొలి వలపో..జతకు పిలుపో బదులే రాదే

మనసుంటే నేరం .. మనసంతే భారం
నిలిచేనా ప్రాణం .. ఒంటిగా

ఎవరో..తను ఎవ్వరో..ఎదురే వచ్చిందీ
వివరం ఏం చెప్పనూ..విరహం రేపిందీ
హో..ఓఓ..ఎవరో..అతనెవ్వరో..అతిధిగ వచ్చాడూ
నిదరే పోతున్న నా ఎదనే కదిపాడూ

ఓ..పరిచయమే ఓ పరిమళమై గంధాలు పూసే
పరువమిలా ఓ పరవశమై గ్రంధం రాసే
ప్రతినిముషం బ్రతుకు సుఖమై ఉయ్యాలలూగే
జతకలిసే అతని కొరకే ఎదురే చూసే

హౄదయం లో దాహం..తడిపే ఓ మేఘం
ఎపుడూ నీ స్నేహం..ఓ ప్రియా

ఎవరో..అతనెవ్వరో..అతిధిగ వచ్చాడూ
నిదరే పోతున్న నా ఎదనే కదిపాడూ
తెలవారే వేళా..హా.. కలగన్నా తననే.. హా..
అది ప్రేమో.. హా..ఏమో..ఏమిటో
 

2 comments:

కొన్ని మూవీస్ యెప్పుడు వచ్చి వెళ్ళిపోతాయో కూడా తెలీదు..కానీ అందులో సాంగ్స్ మాత్రం మనసుని టచ్ చేస్తాయి..నైస్ సాంగ్ అండి..

నిజమేనండీ.. కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడమ్ వల్ల పాటలకు దక్కాల్సిన ఆదరణ దక్కదు... ఈ పాట మరింత ఫేమస్ అయి ఉండాల్సిన పాట. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.