వారసుడొచ్చాడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
నీ అందం నా ప్రేమ గీత గోవిందం
నీ అందం నా ప్రేమ గీత గోవిందం
జీరాడు కుచ్చిళ్ళ పారాడు పాదాల
నీ అందం నా ప్రేమ గీత గోవిందం
హంసల్లె వచ్చింది హింసల్లె గిచ్చింది
నీ రాగం ఏ ప్రేమ వీణ సంగీతం
చిత్రం : వారసుడొచ్చాడు (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర
నీ అందం నా ప్రేమ గీత గోవిందం
ఈ వర్ణం నా కీరవాణి సంకేతం
నీ రాగం ఏ ప్రేమ వీణ సంగీతం
ఈ యోగం ఏ జీవధార సంయోగం
వయ్యారి రూపం.. గాంధార శిల్పం.. శృంగార దీపం వెలిగిస్తే
నీ చూపు కోణం సంధించు బాణం నా లేత ప్రాణం వేధిస్తే
నీ అందం నా ప్రేమ గీత గోవిందం
ఈ యోగం ఏ జీవధార సంయోగం
జీరాడు కుచ్చిళ్ళ పారాడు పాదాల
పారాణి వేదాలు గమకించగా
కోరాడు మీసాల తారాడు మోసాల
నా మందహాసాలు చమకించగా
ఆరారు ఋతువుల్లో అల్లారు ముద్దుల్లో
ఎదజంట తాళాలు వినిపించగా
ఆషాడ మేఘాల ఆవేశ గీతాలు
సరికొత్త బావాలు సవరించగా
నీ కోసమే ఈడు నేను వేచాములే
నీ కోసమే నాలో నన్నే దాచానులే
నిను పిలిచాను మలిసంధ్య పేరంటం
ఇక మొదలాయే పొదరింటి పోరాటం ఆరాటం
నీ అందం నా ప్రేమ గీత గోవిందం
ఈ యోగం ఏ జీవధార సంయోగం
హంసల్లె వచ్చింది హింసల్లె గిచ్చింది
నీ నవ్వు నా పువ్వు వికసించగా
మాటల్లే వచ్చింది మనసేదో విప్పింది
వద్దన్నా నీ మాట వలపించగా
రెప్పల్లొ కొచ్చింది రేపల్లె కాళింది
నా నువ్వు నీ నేను క్రీడించగా
గాధల్లొ నిదరోయీ రాధమ్మ లేచింది
నా వేణువె నాకు వినిపించగా
నీ పించమే కిలకించితాలు చేసిందిలే
నా కోసమే ఈ పారిజాతం పూసిందిలే
మన హృదయాలలో ప్రేమ తారంగం
స్వరబృందా విహారాల కుందేటి ఆనందం
నీ రాగం ఏ ప్రేమ వీణ సంగీతం
ఈ యోగం ఏ జీవధార సంయోగం
వయ్యారి రూపం గాంధార శిల్పం శృంగార దీపం వెలిగిస్తే
నీ చూపు కోణం సంధించు బాణం నా లేత ప్రాణం వేధిస్తే
నీ అందం నా ప్రేమ గీత గోవిందం
ఈ యోగం ఏ జీవధార సంయోగం
2 comments:
ఇళయరాజా గారి పాటలు యాజ్ యూజువల్ ఎవ్వెర్ గ్రీన్..
ఎస్ శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.