సోమవారం, సెప్టెంబర్ 19, 2016

ఏనాడు అనుకోనిదీ...

సత్యం గారు స్వరపరచిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట  ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.చిత్రం : దొరలు దొంగలు (1976)
సంగీతం : సత్యం
సాహిత్యం : మల్లెమాల
గానం : బాలు, సుశీల

ఏనాడు అనుకోనిదీ...  ఈనాడు నాదైనదీ
ఏనాడు అనుకోనిదీ...  ఈనాడు నాదైనదీ
వెల లేనిది... కల కానిది... ఇలలోన సరి రానిదీ
ఏనాడు అనుకోనిదీ... ఈనాడు నాదైనదీ

వెన్నెల పొదిగిన దొన్నెలు... కన్నులు
పెదవుల కందించనా.. పరవశమొ౦దించనా
అందం విరిసిన ఆమని వేళా
విందులు కొదవుండునా.. వింతలు లేకుండునా
ఊహూహూ..వేడుక.. వాడుక.. కాకుండునా...

ఏనాడు అనుకోనిదీ... ఈనాడు నాదైనదీ

కౌగిట అదిమి...  హృదయం చిదిమి
మధువులు కురిపించనా.. మదనుని మరిపించనా  
అందని స్వర్గం ముందు నిలిచితే
ఎందుకు పోమ్మ౦దునా.. ఇది వేళ కాదందునా
ఊహూహూ.. తీరిక.. కోరిక.. లేదందునా

ఏనాడు అనుకోనిదీ...  ఈనాడు నాదైనదీ
వెల లేనిది.. కల కానిది.. ఇలలోన సరి రానిదీ
ఏనాడు అనుకోనిదీ...  ఈనాడు నాదైనదీ


2 comments:

సత్యంగారి మెలొడీస్ మనసుని చాలా సున్నితం గా స్పృసిస్తాయి..

కాదనగలమా శాంతి గారు.. నిజమే.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.