జీవితం చిత్రం కోసం రమేష్ నాయుడి గారి స్వరసారధ్యంలో రామకృష్ణగారు గానం చేసిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. పాట వీడియో దొరకలేదు ఎంబెడ్ చేసినది ఈటీవి స్వరాభిషేకంలొ రామకృష్ణగారే గానం చేసిన వీడియో. ఆ లింక్ ఇక్కడ.
చిత్రం : జీవితం (1973)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : సినారె
గానం : సుశీల, రామకృష్ణ
ఇక్కడే కలుసుకొన్నాము
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : సినారె
గానం : సుశీల, రామకృష్ణ
ఇక్కడే కలుసుకొన్నాము
ఎప్పుడో కలుసుకున్నాము
ఏ జన్మలోనో... ఏ జన్మలోనో
ఎన్నెన్ని జన్మలలోనో
ఇక్కడే కలుసుకొన్నాము
ఇక్కడే కలుసుకొన్నాము
ఎప్పుడో కలుసుకున్నాము
నీలనీల గగనాల మేఘ కల్పాల పైన..
నీలనీల గగనాల మేఘ కల్పాల పైన..
పారిజాత సుమసౌరభాల కెరటాలలోన
నీలనీల గగనాల మేఘ కల్పాల పైన..
పారిజాత సుమసౌరభాల కెరటాలలోన
నీ చేయి నా పండువెన్నెల దిండుగా..
నీ రూపమే నా గుండెలో నిండగా
కలలన్నీ వడబోసి... కలలన్నీ వడబోసి..
కలలన్నీ వడబోసి... కలలన్నీ వడబోసి..
కౌగిలిలో చవి చూసి
ఇక్కడే కలుసుకొన్నాము..
ఎప్పుడో కలుసుకున్నాము
ఇక్కడే కలుసుకొన్నాము..
ఎప్పుడో కలుసుకున్నాము
నాటి జన్మలో ఓ చెలీ నా చరణాల వ్రాలి ఎమన్నావు?
జన్మజన్మలకు నా స్వామీ నీ చరణదాసినని అన్నాను
అంతలో నిను చేరదీసి మరి నేనేమన్నాను?
ఓ సఖీ నా ఊపిరిలో నీ వున్నావని అన్నావు
జన్మజన్మలకు నా స్వామీ నీ చరణదాసినని అన్నాను
అంతలో నిను చేరదీసి మరి నేనేమన్నాను?
ఓ సఖీ నా ఊపిరిలో నీ వున్నావని అన్నావు
ఆనాటి అనుబంధం ఈ నాటి మనబంధం..
ఆనాటి అనుబంధం ఈ నాటి మనబంధం
ఇక్కడే కలుసుకొన్నాము...
ఎప్పుడో కలుసుకున్నాము
ఆనాటి అనుబంధం ఈ నాటి మనబంధం
ఇక్కడే కలుసుకొన్నాము...
ఎప్పుడో కలుసుకున్నాము
2 comments:
ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటుందండీ..
అవునా.. నేను చుడలేదండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.