బృందావనం చిత్రం కోసం మాధవపెద్ది సురేష్ స్వరపరచిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కొవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : బృందావనం (1992)
సంగీతం : మాదవపెద్ది సురేశ్
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : బాలు, జానకి
మధురమే సుధాగానం... మనకిదే మరోప్రాణం
మదిలో మొహన గీతం... మెదిలే తొలి సంగీతం
మధురమే సుధాగానం... మనకిదే మరోప్రాణం
మదిలో మొహన గీతం... మెదిలే తొలి సంగీతం
చరణాలు ఎన్నివున్నా పల్లవొకటే కదా
కిరణాలు ఎన్ని వున్నా వెలుగొక్కటేకదా
శతకోటి భావాలను పలుకు ఎద మారునా
సరిగమలు మారుతున్న మధురిమలు మారునా
మధురమే సుధాగానం... మనకిదే మరోప్రాణం
మదిలో మొహన గీతం... మెదిలే తొలి సంగీతం
వేవేల తారలున్నా నింగి ఒకటే కదా
ఎన్నెన్ని దారులున్నా గమ్యమొకటే కదా
ఎనలేని రాగలకు నాదమొకటే కదా
అనుభూతులెన్ని వున్నా హృదయమొకటే కదా
మధురమే సుధాగానం... మనకిదే మరోప్రాణం
మదిలో మొహన గీతం... మెదిలే తొలి సంగీతం
మధురమే సుధాగానం... మనకిదే మరోప్రాణం
మదిలో మొహన గీతం... మెదిలే తొలి సంగీతం
మదిలో మొహన గీతం... మెదిలే తొలి సంగీతం
2 comments:
పాటకి తగిన పిక్..
అవును శాంతి గారు.. నాక్కూడా బాగా నచ్చింది.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.