శుక్రవారం, సెప్టెంబర్ 23, 2016

కలిసే ప్రతి సంధ్యలో...

వంశీ గారు తీసిన ఆలాపన చిత్రం కోసం ఇళయరాజా గారు స్వరపరచిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆలాపన (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సినారె
గానం : బాలు, జానకి

కలిసే ప్రతి సంధ్యలో.. కలిగే పులకింతలో
కలిసే ప్రతి సంధ్యలో.. కలిగే పులకింతలో
నాట్యాలన్నీ కరగాలి... నీలో నేనే మిగలాలి
నాట్యాలన్నీ కరగాలి... నీలో నేనే మిగలాలి
కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో..

పొంగిపోదా సాగరాత్మ నింగికి.. ఆఆ.ఆ..
చేరుకోదా చంద్ర హృదయం నీటికి.. ఆఆ.ఆ..
పొంగిపోదా సాగరాత్మ నింగికి.. ఆఆ.ఆ..
చేరుకోదా చంద్ర హృదయం నీటికి.. ఆఆ.ఆ..
సృష్టిలోన ఉంది ఈ బంధమే
అల్లుకుంది అంతటా అందమే
తొణికే బిడియం తొలగాలి
ఒణికే అధరం పిలవాలి
ఆ..ఆ...ఆ...

కలిసే ప్రతి సంధ్యలో...
పలికే ప్రతి అందెలో

మేనితోనే ఆగుతాయి ముద్రలు.. ఆఆ.ఆ..
గుండె దాకా సాగుతాయి ముద్దులు.. ఆఆ.ఆ..
మేనితోనే ఆగుతాయి ముద్రలు.. ఆఆ.ఆ..
గుండె దాకా సాగుతాయి ముద్దులు.. ఆఆ.ఆ..
ఇంత తీపి కొంతగా పంచుకో
వెన్నెలంత కళ్ళలో నింపుకో
బ్రతుకే జతగా పారాలి
పరువం తీరం చేరాలి
ఆ...ఆ...ఆ...ఆ

కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో
కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో
నాట్యాలెన్నో ఎదగాలి.. నాలో నేనై మిగలాలి
నాట్యాలెన్నో ఎదగాలి.. నాలో నేనై మిగలాలి
కలిసే ప్రతి సంధ్యలో... కలిగే పులకింతలో

4 comments:

ఈ మూవీ లో ప్రతి పాటా మనసుని హాంట్ చేసేదే..వంశీ, భానుప్రియ, ఇళయరాజ కాంబినేషన్ గురించి యెంత చెప్పినా తక్కువే..

అవునండీ ఈ సినిమాలో అన్ని పాటలూ బాగుంటాయ్.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

ఈ సినిమాలో "ప్రియతమా తమా సంగీతం", "ఆవేశమంతా ఆలాపనేలే" పాటలు రెండే వేటూరి గారు రాశారండీ. మిగిలినవి అన్నీ సినారే గారే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.