ఆదివారం, సెప్టెంబర్ 11, 2016

ఓ కొంటె కోణంగి...

కిరాయి రౌడీలు చిత్రం కోసమ్ చక్రవర్తి గారు స్వరపరచిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కిరాయి రౌడీలు (1981)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల

ఓ కొంటె కోణంగి... సరసాల సంపంగి
ఓ కొంటె కోణంగి... సరసాల సంపంగి
సై అంటే సై అంటాలే.. సయ్యాటలో
ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి
ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి
సై అంటే సై అంటావా సయ్యాటలో..ఓ.. ఓ..
ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. హా...
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ...
కొండలెన్నో ఎక్కావా... కోనలెన్నో దాటావా
కోరుకొండా ఎక్కాను... గోలుకొండా కొట్టాను
ఎక్కలేకా పడ్డావా...  దాటలేక జారావా
ఎన్ని తిప్పలు పడ్డానో...  ఏమి చెప్పను బుల్లమ్మో
ఓ కోడె వయసా... ఓ కొంటె మనసా
ఓ కోడె వయసా... ఓ కొంటె మనసా
ఆడదంటే అలుసా... కాదే కులాసా

ఓ కొంటె కోణంగి... సరసాల సంపంగి
సై అంటే సై అంటావా సయ్యాటలో..
ఓ కొంటె కోణంగి... సరసాల సంపంగి
డడడడడడ డడ్డడడా...
డడడడడడ డడ్డడడా...

రెప్ప కొట్టే చూపుందా.. రెచ్చగొట్టే రూపుందా
హా.. కోరికంటి మనసుంది...  కోరుకున్న కైపుంది
తోడు లేని ఈడుందా.. తోడుబెట్టామంటుందా
పాలు పొంగే ఈడుంది... పాలు పంచే పదునుంది
ఓ లేత వయసా... నేనంటే మనసా
ఓ..హో..హో.. లేత వయసా... అ..అ..ఆ.. నేనంటే మనసా
అరెరెరే.. వరించాను తెలుసా...  అదే నా బరోసా

ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి
సై అంటే సై అంటాలే.. సయ్యాటలో
ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి... ఈ..ఈ...

 

2 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.