సత్యం గారు స్వరపరచిన మరో చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ఏది పాపం? ఏది పుణ్యం? (1979)
సంగీతం : సత్యం
సాహిత్యం : మైలవరపు గోపి
గానం : బాలు, సుశీల
కాలమిలా ఆగిపోనీ...కలనిజమై సాగిపోనీ
అన్నీ మరచి... ఈ నిమిషంలో... నీ ఒడిలోనే నిదురపోనీ
కాలమిలా ఆగిపోనీ...కలనిజమై సాగిపోనీ
అన్నీ మరచి ఈ నిమిషంలో... నీ ఒడిలోనే నిదురపోనీ...
కాలమిలా ఆగిపోనీ...
తొలిసంజె మలి సంజెలేల... నా చెంత చెలి ఉన్న వేళ
తొలిసంజె మలి సంజెలేల... నా చెంత చెలి ఉన్న వేళ
చిరుగాలి సెలయేరులేల... నా మనిషి తోడున్న వేళ
అరుదైన వేళ... ఈ శుభవేళ...
బ్రతుకే వెన్నెల వేళా... వేళా.. వేళా..
కాలమిలా ఆగిపోనీ... కలనిజమై సాగిపోనీ
అన్నీ మరచి...ఆ..ఆ..
ఈ నిమిషంలో...ఆ...ఆ.. నీ ఒడిలోనే నిదురపోనీ...
కాలమిలా ఆగిపోనీ...
సిరిదివ్వెలో వెలుగులాగ... నీ చూపులో నిలిచిపోనీ
సిరిదివ్వెలో వెలుగులాగ... నీ చూపులో నిలిచిపోనీ
జేగంటలో రవళిలాగ... నీ ఊపిరై కలిసిపోనీ...
కలలే గానీ... కలతే లేని..లోకానకే చేరిపోనీ... చేరిపోనీ...
కాలమిలా ఆగిపోనీ... కలనిజమై సాగిపోనీ
అన్నీ మరచి...ఆ..ఆ..
ఈ నిమిషంలో...ఆ...ఆ..నీ ఒడిలోనే నిదురపోనీ...
కాలమిలా ఆగిపోనీ...
2 comments:
నిజంగా పాట వింటున్నప్పుడు కాలమాగినట్టే అనిపిస్తుంది కదండీ.
అవును శాంతి గారూ.. సత్యం గారి సంగీతమే అంత.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.