అన్నదమ్ముల అనుబంధం చిత్రం లోని ఒక చక్కని పాట ఈ రోజు మనం తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అన్నదమ్ముల అనుబంధం (1975)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల
గులాబిపువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే
ఇలాంటి వేళ ఆడాలి జతగా
ఇలాగె మనము ఉండాలిలే
మనసు దోచి మాయజేసీ
చెలినే మరచిపోవొద్దోయి రాజా... రాజా
గులాబిపువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే
వసంతరాణి నీకోసమే ఖుషిగ వచ్చింది
చలాకినవ్వు చిందించుచు హుషారు తెచ్చింది
మయూరిలాగా నీ ముందర నాట్యం చేసేను
వయ్యారిలాగా నీ గుండెలో కాపురముంటాను
వలపుపెంచి మమతపంచి
విడిచిపోనని మాటివ్వాలి రాజా... రాజా
గులాబిపువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే
మరీ మరీ నీ అందానికీ సలాము చేసేను
పదే పదే నీ గీతానికి పల్లవి పాడేను
యుగాలకైనా నాదానివై నీవే వుంటావు
అనంతకాలం నీ రూపమే వరించుకుంటాను
మనసు నీదే మమత నీదే..
రేయి పగలు నాలో వున్నది నీవే.. సోనీ
గులాబిపువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే
ఇలాంటి వేళ ఆడాలి జతగా
ఇలాగె మనము ఉండాలిలే
లాలలా లాలలా లాలలా లాలలా
2 comments:
యాదోంకీ బారాత్..చురలియా హై తుం నె జో దిల్ కో..మనసుని మాయ చేసే పాటలు..
మరే మాబాగా చెప్పారు :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.